Priyadarshi Calls Rithu Varma Darling Nabha Natesh Fires: సోషల్ మీడియాలో నటుడు ప్రియదర్శి చేస్తున్న రచ్చ అంతా కాదు. నిన్నటికి నిన్న నభా నటేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియోకి డార్లింగ్ అంటూ కామెంట్ పెట్టడంతో ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలియని వారిని డార్లింగ్ అని పిలిస్తే అది ఐపిసి సెక్షన్ 354 ఏ ప్రకారం శిక్షార్హం అంటూ వార్నింగ్ ఇచ్చింది. దానికి ప్రియదర్శి చాలా కామెడీగా తీసుకుంటూ రిప్లై ఇచ్చాడు. అయితే ఏదో జరుగుతోంది అనే అనుమానాల మధ్య ఈరోజు మరో హీరోయిన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో మీద కూడా ప్రియదర్శి ఇదే విధమైన కామెంట్స్ చేశాడు. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు రీతు వర్మ. ఆమె బ్లాక్ శారీలో ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా దానికి ప్రియదర్శి వావ్ రీతు డార్లింగ్ నిన్ను పొగడాలంటే నా పిక్ అప్ లైన్స్ కూడా సరిపోవడం లేదు అంటూ రాసుకొచ్చాడు ప్రియదర్శి పెట్టిన కామెంట్ కి నభా నటేష్ స్పందిస్తూ మళ్ళీ వచ్చేశాడు.
Salman Khan House Firing: సల్మాన్ ఇంటి బయట కాల్పులకు 4 లక్షల కాంట్రాక్ట్?
గర్ల్స్ కామెంట్ సెక్షన్లో నీకు ఇప్పుడు వచ్చిన ఈ సడన్ ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకు అందరినీ డార్లింగ్ అని పిలుస్తున్నావు? నీ మైండ్ ఏమైనా ఖరాబ్ అయిందా? అంటూ ప్రశ్నించింది. దానికి ప్రియదర్శి అరే నేను ఎవరిని డార్లింగ్ అంటే నీకెందుకు? నీకెందుకు వచ్చిన బాధ వై దిస్ కొలవెరి మేడం అంటూ ప్రశ్నించడం గమనార్హం. దానికి రీతు వర్మ స్పందిస్తూ నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి అని ప్రశ్నిస్తోంది. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్ అని తెలుస్తోంది. ఇటీవలే ప్రియదర్శి హీరోగా మూడవ సినిమా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మొదలైంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్నారని, బహుశా వీరి అనౌన్స్మెంట్ లేదా సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కోసమే ఇంత రచ్చ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా టైటిల్ కూడా వై దిస్ కొలవెరి అని ఫిక్స్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Priyadarshi