Malayalam Cinema : మనకు సంక్రాంతి.. కేరళకు ‘ఓనం’.. స్టార్ హీరోలు పోటాపోటీ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాల రిలీజ్‌కు ఒక్కో ఇండస్ట్రీకి ఒక్కో సీజన్ నడుస్తూ ఉంటుంది . టాలీవుడ్ సంక్రాంతి సీజన్ ఉండే క్రేజ్ వేరు. బాలీవుడ్ ఇయర్ ఎండింగ్ అంటే పడి చచ్చిపోతుంది. అలాగే మాలీవుడ్ కూడా ఓనమ్ సీజన్ ఫుల్ డిమాండ్. అందుకే మల్లూవుడ్ స్టార్ హీరోలు ఈ ప్రత్యేకమైన పండుగపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో మోహన్ లాల్ కీ రోల్ చేస్తున్నారని టాక్.
దుల్కర్ సల్మాన్ మాలీవుడ్‌తో ఈ మధ్య టచ్ కోల్పోయాడు. టాలీవుడ్, కోలీవుడ్ చుట్టేసిన డీక్యూ కింగ్ ఆఫ్ కోత తర్వాత పలకరిస్తోన్న ఫిల్మ్ ఐయామ్ గేమ్. హీస్ట్, గ్యాబ్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఆర్డీఎక్స్ ఫేమ్ నహాస్ ఇదియాత్ దర్శకుడు. ఈ సినిమా కూడా ఓనమ్ పండుగను టార్గెట్ చేస్తూ ఆగస్టు 20నే థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. గత ఏడాది లోకతో నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్ చూసిన దుల్కర్… ఈ పండుగకు సక్సెస్ చూస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. ప్రేమలు ఫేం గిరీష్ ఏడీ నుండి వస్తోన్న ఫిల్మ్ బెత్లెహం కుడుంబ యూనిట్. నివిన్ పౌలీ, మమితా బైజు లీడ్ రోల్స్. మేలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు కానీ.. ఓనమ్ పండుగకే వస్తున్నట్లు ఎనౌన్స్ చేశాడు హీరో. ఇదొక హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కించాడట గిరీష్ ఏడీ. ఆగస్టు 16 నుండి 25తో ముగిసే ఈ పండుగపై ఇప్పటికే ఈ స్టార్స్ కర్చీఫ్ వేశారు. ఇంకా టూ మంత్స్ గ్యాప్ ఉంది.. ఈ రేసులోకి ఎంత మంది వస్తారో..? తప్పుకుంటారో…? చూడాలి
Also Read
తాజావార్తలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?