Site icon NTV Telugu

Tyson: ‘కేజీఎఫ్’ మేకర్స్ కొత్త చిత్రం.. హీరో ఎవరంటే..?

Tyson

Tyson

హోంబలే ఫిల్మ్స్ .. ఒకప్పుడు ఈ బ్యానర్ అంటే ఏదో కొత్తది అనుకున్నారు.. కానీ కెజిఎఫ్ సినిమా రిలీజ్ అయ్యాకా హోంబాలే అంటే ఒక బ్రాండ్.. ఇక కెజిఎఫ్ 2 తో పాన్ ఇండియా మొత్తంగా హోంబలే ఫిల్మ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాకా ఈ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం ‘సలార్’. ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక కెజిఎఫ్ 2 విడుదల అయినప్పుడు హోంబాలే ఫిల్మ్స్ అబిమనులకు ఒక ప్రామిస్ చేసింది.. తాము తీయబోయే ప్రతి సినిమా అభిమానుల అంచనాలకు అందకుండా ఉంటుందని, వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేలా చేస్తామని చెప్పుకొచ్చారు. అన్నమాట మీదే ప్రస్తుతం మరో సర్ ప్రైజింగ్ అనౌన్స్ మెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ బ్యానర్ లో మరో కొత్త చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు.

మలయాళ స్టార్ హీరో పృధ్వీ రాజ్ సుకుమారన్ హీరోగా ‘టైసన్’ అనే చిత్రం చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. “టైసన్.. మా ధైర్యమైన డిఫెండర్‌ని చూసి ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి. గొలుసులను విప్పి, వ్యవస్థను పునరుజ్జీవింపజేసే సమయం” వచ్చేసింది అంటూ మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం కూడా పృధ్వీ రాజ్ చేయడం విశేషం.. మురళీ గోపి ఈ సినిమాకు కథను అందిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ లో కొత్తగా బదిలీ అయ్యి వచ్చిన ఐఏఎస్ పేర్లను ప్రభుత్వ కార్యాలయంలోని గుమస్తా రాస్తూ కనిపించాడు. అంటే ఈ చిత్రంలో పృధ్వీ రాజ్ సుకుమారన్ ఐఏఎస్ ఆఫీసర్ గా దర్శనం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అతనికి ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు.. ఏదిఏమైనా ఒక అపజయం ఎరుగని నటుడు, ఇప్పటివరకు అపజయం ఎరుగని ఒక నిర్మాణ సంస్థ కలిసి వస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లోనూ ఏ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మరికొద్దిరోజుల్లో తెలియనున్నాయి.

Exit mobile version