Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఎంజాయ్ చేస్తోంది. ప్రేమించిన రణబీర్ ను వివాహమాడి.. ఒక పాపకు తల్లిగా కూడా మారింది. ఇక పెళ్లి అయిన తరువాత కూడా ముద్దుగుమ్మ సినిమాల విషయంలో నిర్లక్ష్యం చేయడం లేదు. నచ్చిన కథలను ఎంచుకొని ముందుకు దూసుకుపోతుంది. ఇక తాజాగా అలియా.. కొత్త ఇంటిని భారీ ధర పెట్టి కొనేసిందట. ఇప్పటికే ముంబైలో రణబీర్ తో కలిసి ఉంటున్న ఇల్లు కాకుండా.. ఆమె మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసిందంట. దానివిలువ అక్షరాలా రూ. 37 కోట్లు అని టాక్ నడుస్తోంది. ఆ ఇంటి రిజిస్ట్రేషన్ కూడా చేయించిందని సమాచారం. ఈ ఇంటి స్టాంప్ డ్యూటీ కోసమే దాదాపు 3 కోట్ల దాకా ఖర్చు అయినట్టు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే అలియా పేరు మీద మూడు విల్లాలు ఉన్నాయి. అవి కూడా దాదాపు 8 కోట్లు విలువ చేస్తాయి. అయితే వాటిని ఈ ముద్దుగుమ్మ తన సోదరికి గిఫ్ట్ గా ఇచ్చిందంట. ఇకపోతే ఈ ఇల్లు కాకుండా రణబీర్ తో కలిసి ఉండడానికి అలియా ఒక డ్రీమ్ హౌస్ ను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. తమ అభిరుచులకు తగ్గట్టు ఆ ఇల్లు ఉండనున్నదట. ఇక ఇంత ఇల్లు పెట్టుకొని మరో కొత్త ఇల్లు ఎందుకు.. అంటే.. అలియా ఈ మధ్యనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఆ ఆఫీస్ కోసమే ఈ ఇల్లును కొనుగోలు చేసిందని టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.