Site icon NTV Telugu

Preminchoddu: బేబీ నాదన్న డైరెక్టర్ నుంచి ‘ప్రేమించొద్దు’.. జూన్ 7న రిలీజ్!

Preminchoddu

Preminchoddu

Preminchoddu Movie All set To Release on June 7th: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బేబీ’ సినిమాలో విరాజ్ ఆనంద్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయి కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టి బాక్సాఫీసును ఒక రేంజ్ లో షేక్ చేసింది. ఈ బేబీ సినిమాను డైరెక్టర్ సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా డైరెక్టర్ మారుతితో కలిసి నిర్మాతగా మారిన ఎస్‌కేఎన్ తెరకెక్కించారు. ఇక ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ కారణంగా బేబీ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో సాయి రాజేష్, ఎస్‌కేఎన్‌ కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారని శిరిన్ శ్రీరామ్ అనే షార్ట్ ఫిలిం డైరెక్టర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ప్రేమించొద్దు’ అనే టైటిల్‌తో స్టోరీ చెప్పానని అంటూ పోలీస్ కేసు వరకు వెళ్లిన శిరిన్ శ్రీరామ్ ‘ప్రేమించొద్దు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ‘ప్రేమించొద్దు సినిమా శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో రూపొందింది. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ఇది.

Chandrababu Biopic: ఎన్నికల ముందు సైలెంటుగా యూట్యూబ్లో చంద్రబాబు బయోపిక్

ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించగా తెలుగు వెర్షన్ ని జూన్ 7న విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘యువతలో చాలా మంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారు. ఇది వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే కోణం లో ‘ప్రేమించొద్దు’ అనే శీర్షిక తో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం. అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తున్న సినిమా కావడంతో సినిమాను జూన్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే తెలుగు లో విడుదల చేసిన తర్వాత, త్వరలో త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌టానికి కూడా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

Exit mobile version