Premi Vishwanath: ప్రేమి విశ్వనాథ్.. అంటే ఆమె ఎవరు.. కొత్త హీరోయినా అని అడుగుతారు. అదే వంటలక్క అని అడగండి.. అరే వంటలక్క తెలియని వాళ్ళు ఉంటారా.. దీప గురించి మాట్లాడని వారుంటారా..? అని చెప్పుకొస్తారు. అంతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ప్రేమి విశ్వనాధ్.. అదేనండీ మన వంటలక్క. కార్తీక దీపం సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరయిన ఆమె సినిమాల్లో నటిస్తుందని అంతకు ముందు వార్తలు వచ్చాయి. ఇక కార్తీక దీపం నుంచి ఆమె బయటికి వెళ్ళిపోవడంతో ప్రేక్షకులు కూడా అదే నిజమే అనుకున్నారు. అయితే ఏ సినిమాలో నటిస్తోంది.. ఏ హీరోకు అక్క గా నటిస్తోంది అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
ఇక వంటలక్క ఎప్పుడైతే సీరియల్ నుంచి బయటికి వచ్చేసిందో కార్తీక దీపం సీరియల్ రేటింగ్ అమాంతం కిందకు పడిపోయింది. దీంతో ఛానెల్ యాజమాన్యం వంటలక్క లేకపోతే కష్టమని చెప్పి మళ్లీ ఆమె ట్రాక్ ను తీసుకొచ్చారు. అయితే కార్తీక దీపం మళ్లీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ప్రేమి.. ప్రస్తుతం వరుస సినిమాలో నటించడానికి సిద్దమయ్యింది. తన మొదటి సినిమాగా నాగచైతన్య NC 22 నిలవనుంది. నాగ చైతన్య హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో వంటలక్క కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో చైతూ సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాతో ప్రేమి వెండితెరపై అడుగుపెట్టబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆమె చైతూ కు అక్కగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ సినిమా హిట్ అయ్యి ఆమెకు వరుస ఆఫర్లు వస్తే కార్తీక దీపం సీరియల్ క్లోజ్ చేసుకోవచ్చని అంటున్నారు అభిమానులు. మరి ఈ సినిమా వంటలక్కకు ఎలాంటి పేరును తీసుకురానుందో చూడాలి.
