NTV Telugu Site icon

Premalu 2: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ రెడీ అవుతోంది.. రిలీజ్ ఎప్పుడంటే?

Premalu 2

Premalu 2

Premalu 2 Movie getting Ready: ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు వరుస హిట్లుగా నిలిచిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి సినిమాలలో ప్రేమలు సినిమా కూడా ఒకటి. గిరీష్ ఏడీ దర్శకత్వంలో నస్లేన్ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా కేవలం మలయాళంలోనే కాదు తర్వాత తెలుగులో కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ ప్రేమలు సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు సినిమా నిర్మాణ సంస్థ భావన స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ ప్రేమలు 2 సినిమాని కూడా తాను తెలుగువారికి అందించబోతున్నట్లు ప్రకటించారు. ప్రేమలు సినిమా నా జీవితంలోనే ఒక అద్భుతమైన అధ్యాయం, దాన్ని మరిచిపోలేని విధంగా చేసిన తెలుగు ఆడియన్స్ కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.

Sita Kalyana Vaibhogame: సీతమ్మ లేని గుడి రాముడి గుడే కాదు.. ఆసక్తికరంగా టీజర్!

భావన స్టూడియోస్ కి కూడా వారు ఇచ్చిన సపోర్ట్ అండ్ లవ్ కి బిగ్ థ్యాంక్స్. అలాగే ఇప్పుడు ప్రేమలు 2 సినిమాని కూడా తెలుగువారికి అందించేందుకు ఎగ్జైటెడ్ గా ఉన్నాను అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రేమలు 2 సినిమా పోస్టర్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే 2025 సంవత్సరంలో సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక పోస్టర్ లో షేర్ చేసిన దాన్నిబట్టి వెనకాల కోటల్లాగా కనిపిస్తున్నాయి. అయితే ఆ కోటలు ఎక్కడివి? అనే విషయం మీద క్లారిటీ లేదు. కొంత మంది గోల్కొండ కోటయేమో అని కామెంట్ చేస్తుంటే మరికొంతమంది రాజస్థాన్లోని కోటల్లాగా అనిపిస్తున్నాయని అంటున్నారు. కోటల మధ్యలో ఒంటె కూడా కనిపిస్తూ ఉండడంతో ఎక్కువ మధ్య ఎక్కువ మంది రాజస్థాన్ ఏమో అని ఫిక్స్ అవుతున్నారు. అయితే ప్రేమలు మొదటి భాగంలో హీరో లండన్ వెళ్తాడు. మరి రెండో భాగానికి ఎలా లింక్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది