Site icon NTV Telugu

Preity Zinta : అభిమానులకు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరోయిన్..

Preityzinta

Preityzinta

Preity Zinta : స్టార్ హీరోయిన్ ప్రీతి జింతా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. పంజాబ్ కింగ్స్ ఓనర్ గా ఉన్న ప్రీతి.. ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ లో మెరుస్తోంది. ఆమె చేసే హల్ చల్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆమె వీడియోలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. అలాంటి ప్రీతి జింతా తాజాగా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పింది. ఆమె రీసెంట్ గా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఈ నడుమ గుడులకు ఎక్కువగా వెళ్తున్నారు బీజేపీలో చేరుతారా అని ప్రశ్నించాడు. దానికి ప్రీతి జింతా ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘ఇదే సమస్య. ఏదైనా గుడికి వెళ్తే బీజేపీలో చేరుతున్నట్టేనా. నేను గతంలో కుంభమేళాకు వెళ్తే ఇలాగే అన్నారు. నేను కల్చర్ ను ప్రేమిస్తా. నా దేశాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తా’ అంటూ తెలిపింది.
Read Also : MaheshBabu : మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ చూశారా.. భలే ఉన్నాడే..

అయితే అంత చిన్న ప్రశ్నకు ఇంత ఘాటుగా జవాబు ఇవ్వాలా అంటూ ఆమెపై కొందరు విమర్శలు గుప్పించారు. దీంతో ఆమె సదరు అభిమానికి క్షమాపణలు చెప్పింది. ‘దయచేసి నన్ను క్షమించండి. ఈ నడము నాకు ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే నాకు కొంత అసహనంగా అనిపించింది. నేను ఎప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తాను. నా దేశాన్ని ఎప్పుడూ తక్కువ చేయను. విదేశాల్లో ఉన్నప్పుడే నా దేశం విలువ ఏంటో అర్థం అయింది. నా పిల్లలకు మన కల్చర్ తెలియాలి కాబట్టే ఆలయాలకు తిప్పుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. ఆమె చేసేది మంచి పనే అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. దాన్ని రాజకీయం చేయొద్దు అంటూ సూచిస్తున్నారు.
Read Also : Roshan Meka: శ్రీకాంత్ కొడుకుతో రిస్క్ చేస్తున్న దత్ సిస్టర్స్?

Exit mobile version