మొత్తనికి “ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్” సైన్స్ ఫిక్షన్.. నవంబర్ 7న విడుదల కాబోతుంది. దాదాపు నలభై ఏళ్లుగా ప్రేక్షకులను భయపెట్టిన, ఆశ్చర్యపరిచిన ‘ప్రెడేటర్’ సిరీస్ ఇప్పుడు ఒక కొత్త దిశలోకి అడుగుపెడుతోంది. ఈసారి కథలో ట్విస్ట్ ఏంటంటే వేటగాడే వేటలో చిక్కుకుంటాడు..!
Also Read : Janhvi Kapoor : ‘శారీరక సుఖాలు తప్పుకాదు’ వ్యాఖ్యలతో టాక్ షోలో తలపడ్డ స్టార్ హీరోయిన్లు..
మొదటిసారిగా 1987లో విడుదలైన “ప్రెడేటర్” సినిమాలో ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ కమాండో పాత్రలో నటించారు. అమెజాన్ అడవుల్లో కనిపించని మృగం ఒక బృందాన్ని ఒక్కొక్కరిగా వేటాడే కథతో ఈ సినిమా హాలీవుడ్‌లో భయానక సైన్స్ ఫిక్షన్‌కు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. 1990లో రెండో భాగం లాస్ ఏంజెల్స్ నగరంలో సాగింది. ఇక్కడ యౌట్జా అనే ఆ ఎలియన్ వేటగాడు గ్యాంగ్‌స్టర్లను, పోలీసులను వేటాడుతాడు. ఈ సినిమా ద్వారా ఈ జీవులు చాలా కాలంగా మానవ చరిత్రలో ఉన్నాయని సూచన ఇచ్చారు. ఇక్కడ మానవ యోధులను ప్రెడేటర్లు తమ స్వగ్రహానికి తీసుకెళ్లి బంధిస్తారు. అక్కడ సూపర్ ప్రెడేటర్లతో బతికే పోరాటం మొదలవుతుంది. ఈ కథ యౌట్జా జాతి అంతర్గత పోరాటాలను కూడా చూపించింది.
2022 లో “ప్రే” చిత్రం 1719 లో అమెరికా కమాంచీ తెగకు చెందిన యువతి నారు కథతో వచ్చింది. ఈసారి కథ ప్రెడేటర్ కళ్లతో కాకుండా మనిషి కళ్లతో చూపబడింది. ఒక ధైర్యవంతురాలు తన తెగను రక్షించడానికి ప్రెడేటర్‌ను ఎదుర్కోవడం – ఇది ఫ్రాంచైజ్‌కు కొత్త ఊపును ఇచ్చింది. ఇప్పుడు డాన్ ట్రాచ్‌టెన్‌బర్గ్ దర్శకత్వంలో రూపొందుతున్న “ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్” కథ యౌట్జా యువ వేటగాడు డెక్ చుట్టూ తిరుగుతుంది. ప్రమాదకరమైన ఒక గ్రహంలో, ఆండ్రాయిడ్ యోధురాలు థియాతో కలిసి బ్రతికేందుకు పోరాడాల్సి వస్తుంది. కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే – డెక్ తానే వేటలో చిక్కుకుంటాడు..!
ఇది మొదటిసారిగా ప్రెడేటర్ దృష్టికోణంలో చెప్పబడుతున్న కథ. యౌట్జా జాతి జీవన విధానం, విలువలు, గౌరవం, నైతికతల గురించి ప్రేక్షకులు ఇంతవరకు చూడని రీతిలో తెలుసుకోబోతున్నారు. యాక్షన్, థ్రిల్‌తో పాటు ఈసారి “ప్రెడేటర్” సిరీస్‌లో భావోద్వేగం కూడా ప్రధాన పాత్ర పోషించనుంది. మరి “వేట అంటే ఏమిటి? వేటగాడికి సరిహద్దులు ఉంటాయా?” అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సాగే ఈ చిత్రం, యాక్షన్ ప్రేమికులకు మాత్రమే కాదు, లోతైన కథలు ఇష్టపడేవారికి కూడా నచ్చే అవకాశం ఉంది. నవంబర్ 7, 2025న విడుదల కానున్న “ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్” – ఈసారి వేటలో వేటగాడే చిక్కుకుంటాడనే ఆలోచనతోనే అభిమానుల్లో పెద్ద ఆసక్తి రేపుతోంది. ఈ ఫ్రాంచైజ్‌లో ఇదే అత్యంత భావోద్వేగపూరితమైన, సాంకేతికంగా అద్భుతమైన అధ్యాయంగా నిలవబోతుందనే అంచనాలు ఉన్నాయి.
