Praveen IPS movie Glimpse Review: ఐరా ఇన్ఫోటైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మాతగా తెరకెక్కుతున్న తాజా మూవీ “ప్రవీణ్ ఐపీఎస్”, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మాజీ ఐపిఎస్ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బయోపిక్ గా ప్రవీణ్ ఐపిఎస్ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేయగా అందరినీ ఎట్రాక్ట్ చేసే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉంది.
Bigg Boss Telugu 7: హ్యాట్సాఫ్ గౌతమ్..ఆ ఒక్క నిర్ణయంతో వాళ్లందరికీ నచ్చేశావ్ పో!
ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఏడు సంవత్సరాల ఐపీఎస్ సర్వీస్ ఉండగానే ఆ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రవీణ్ కుమార్ చేసిన పోలీస్ సర్వీస్ ను, ఎదుర్కొన్న అణిచివేత, పోలీసు అధికారిగా, గురుకుల సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా చేసిన సేవలను చూపించబోతున్నారు అన్నట్లు గ్లిమ్ప్స్ తో క్లారిటీ వచ్చేసింది. నవంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నంద కిషోర్, రోజా, దుర్గా దేవ్ నాయుడుతో పాటు వన్య అగర్వాల్, సతీష్ సరిపల్లి, జ్యోతి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఎన్ఎస్ ప్రసు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి నాగ్ సోధనపల్లి కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు.