Site icon NTV Telugu

Salaar Song: “ప్రతి కథలో” ఈరోజే బయటకి వస్తుంది… ఆగలేకపోతున్నాం సార్

Salaar Song

Salaar Song

సంక్రాంతి సీజన్ కి ఇంకా టైమ్ ఉంది, న్యూ ఇయర్ కి కూడా టైమ్ ఉంది… అంతెందుకు క్రిస్మస్ పండక్కి కూడా ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. పండగలకి టైమ్ ఉంది కానీ ఇండియా మొత్తం పండగ వాతావరణం నెలకొంది, ఈరోజు అర్ధరాత్రి నుంచే పండగ చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా ఫెస్టివల్ ని పరిచయం చేయడానికి సలార్ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమా ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఉన్న హైప్ ని మరింత పెంచడానికి లాస్ట్ మినిట్ అప్డేట్ ని వదిలింది హోంబలే ఫిల్మ్స్. సలార్ సీజ్ ఫైర్ నుంచి సెకండ్ సాంగ్ “ప్రతి కథలో…” ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు.

ప్రభాస్ మదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఈశ్వరీ రావు పోస్టర్ తో “ప్రతి కథలో” సాంగ్ అనౌన్స్ అయ్యింది. KGF సినిమాలో “ప్రతి కథలో ఒకడుంటాడు కదా… హీరో కాదు విలన్” అనే డైలాగ్ తో రాఖీ భాయ్ కి ఎలివేషన్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు సలార్ సినిమాలో “ప్రతి కథ” పాట దేని గురించి అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. ఈ సాంగ్ బయటకి వచ్చి సలార్ సినిమాపై ఉన్న హైప్ ని మరింత పెంచడం గ్యారెంటీ. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది, ఇక ఇలాంటి సమయంలో మేకర్స్ నుంచి సాంగ్ రావడం అనేది సూపర్బ్ స్ట్రాటజీ. సలార్ నుంచి వచ్చిన సూరీడే సాంగ్ ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు “ప్రతి కథలో…” సాంగ్ కూడా ఆ రేంజ్ హిట్ అయితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ట్రాన్స్ లోకి వెళ్లిపోవడం గ్యారెంటీ.

Exit mobile version