‘హనుమాన్’… ఒక చిన్న సినిమాగా మొదలై పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకున్న సినిమా. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. తక్కువ బడ్జట్ లో, రిచ్ విజువల్స్ తో, హ్యూజ్ స్పాన్ ని సొంతం చేసుకుంది ‘హనుమాన్’ సినిమా. అనౌన్స్మెంట్ తోనే ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హనుమాన్, ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ పెరిగేలా చేసింది. యునానిమస్ గా ప్రతి ఒక్కరికి హనుమాన్ సినిమా సూపర్ హిట్ అవుతుంది, పాన్ ఇండియా రేంజులో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది అనే నమ్మకం ఉంది. టీజర్ తో ఆ నమ్మకం మరింత పెరిగింది. దీంతో సినీ అభిమానులంతా హనుమాన్ మూవీని చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది హనుమాన్ మూవీ.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్… హనుమాన్ ట్రైలర్ విడుదల చేయడానికి రెడీ అయ్యారు. డిసెంబర్ 19న హనుమాన్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసాడు. ఈ అనౌన్స్మెంట్ ఇస్తూ వదిలిన పోస్టర్ చాలా బాగుంది. ట్రైలర్ తో హైప్ పెంచితే జనవరి 12న హనుమాన్ సినిమా మంచి ఓపెనింగ్స్ ని తెచ్చుకుంటుంది. అయితే అదే రోజున మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతుంది, ఇదే సంక్రాంతి సీజన్ లో రవితేజ ఈగల్, నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్ సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. ఈ సినిమాలని తట్టుకోని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ ఏ మేరకు రాణిస్తుంది అనేది చూడాలి.
Time to unleash the Most Powerful Superhero in the Universe 🔥#HANUMAN TRAILER RELEASING ON DECEMBER 19th 💥
🌟ing @tejasajja123
In Cinemas WW From JAN 12th, 2024!@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @GowrahariK @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets… pic.twitter.com/HvjvxlRHTk
— Prasanth Varma (@PrasanthVarma) December 12, 2023
