NTV Telugu Site icon

Prashanth Varma: జై హనుమాన్ కన్నా ముందే మరో సూపర్ హీరో సినిమా… ఇప్పటికే షూటింగ్ కంప్లీట్

Prashanth Varma

Prashanth Varma

హనుమాన్ ప్రమోషన్స్ లో హీరో తేజ సజ్జ మాట్లాడుతూ… “ఇండియాలోనే ఇద్దరు ప్రశాంత్ ల పేర్లు వినిపిస్తాయి… ఒకటి ప్రశాంత్ నీల్, రెండోది ప్రశాంత్ వర్మ” అన్నాడు. ఈ మాట ఏ సమయంలో అన్నాడో తెలియదు కానీ తేజ సజ్జ నమ్మకాన్ని నిజం చేస్తూ హనుమాన్ మూవీ తర్వాత ఇండియా మొత్తం ప్రశాంత్ వర్మ పేరు రీసౌండ్ వచ్చినట్లు వినిపిస్తోంది. లో బడ్జట్ లో స్టన్నింగ్ విజువల్స్ ఇచ్చి… మన సూపర్ హీరో హనుమాన్ ని ప్రపంచానికి పరిచయం చేసాడు ప్రశాంత్ వర్మ. హాలీవుడ్ మీడియా కూడా హనుమాన్ గురించి మాట్లాడుతుంది అంటే ప్రశాంత్ వర్మ ఎలాంటి అఛీవ్మెంట్ సాధించాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి క్రియేటివ్ సినిమాలనే చేస్తూ వచ్చిన ప్రశాంత్ వర్మ… హనుమాన్ సినిమా ఎండ్ లో “జై హనుమాన్” మూవీకి లీడ్ ఇచ్చి వదిలేసాడు. ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని కూడా చెప్పేసిన ప్రశాంత్ వర్మ… ఇప్పుడు జై హనుమాన్ కన్నా ముందు ఇంకో సినిమాని రెడీ చేసే పనిలో ఉన్నాడు.

హనుమాన్ మూవీ ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది, రిలీజ్ కి మాత్రమే డిలే అయ్యింది. ఈ గ్యాప్ లో ప్రశాంత్ వర్మ ఇంకో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాడని సమాచారం. అయితే ఇది కూడా సూపర్ హీరో సినిమానే అనే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఇప్పటికే “అధిర” అనే సూపర్ హీరో సినిమాని అనౌన్స్ చేసాడు. ఈ మూవీ షూటింగ్ నే ప్రశాంత్ వర్మ కంప్లీట్ చేశాడా లేక వేరే కొత్త ప్రాజెక్ట్ ని ఏమైనా తక్కువ బడ్జట్ లో కంప్లీట్ చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రశాంత్ వర్మ ‘అధిర’ సినిమాతోనే ఆడియన్స్ ముందుకి రానున్నాడు. మరి ఈసారి ప్రశాంత్ వర్మ ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడు అనేది చూడాలి.