418 Movie: ప్రశాంత్ నీల్ హరర్ థ్రిల్లర్ ‘418’కు ‘ఏ’ సర్టిఫికెట్.. రిలీజ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
418 Movie: ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న సరికొత్త ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ ‘418’. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భయపెట్టే సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు (CBFC) మొదట సర్టిఫికేషన్ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో మేకర్స్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించగా, ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్‌ను జారీ చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం, సెన్సార్ ఆలస్యం కారణంగా వాయిదా పడి ఇప్పుడు 2026 సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
ఈ సినిమా కథాంశం సాధారణంగా వచ్చే హారర్ కామెడీ సినిమాలకు భిన్నంగా, ఎలాంటి కామెడీ లేకుండా ప్రేక్షకులను కేవలం భయపెట్టడమే లక్ష్యంగా సాగుతుంది. ఒక పల్లెటూరిలోని మెడికల్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో, సైన్స్‌కు మూఢనమ్మకాలకు మధ్య ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఒక రహస్యమైన తలుపు తెరిచిన తర్వాత చోటుచేసుకునే వింత పరిణామాల చుట్టూ ఈ సస్పెన్స్ మిస్టరీని అల్లారు. ప్రశాంత్ నీల్ సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కూడా మేకర్స్ సిద్ధమవుతున్నారు. దర్శకుడిగా కీర్తన్ నాడగౌడకు ఇది తొలి సినిమా కావడంతో ‘418’ ఆయనకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా మారింది. మరి ‘ఏ’ సర్టిఫికెట్తో సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రాబోతున్న ‘418’ ప్రేక్షకులను ఎంతవరకు భయపెడుతుంది, మిస్టరీ థ్రిల్లర్‌గా ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!