NTV Telugu Site icon

Prashanth Neel: తల అజిత్ తో నీల్ బ్రోనా? కాస్త చూసి వార్తలు స్ప్రెడ్ చేయండయ్యా…

Prashanth Neel

Prashanth Neel

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ హీరో గురించి ఏ డైరెక్టర్ గురించి… ఎవరి కాంబినేషన్ గురించి ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఎవరికి తోచిన న్యూస్ వాళ్లు, ఎవరికి అనిపించింది వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ న్యూస్ ని నిజం అనుకోని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి వార్తనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సలార్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్, తల అజిత్ తో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు… ఈ కాంబినేషన్ ని హోంబలే ఫిల్మ్స్ సెట్ చేసిందనే వార్త నెట్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇది నిజమయ్యే అవకాశమే కనిపించట్లేదు… ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం భారీ లైనప్ ని మైంటైన్ చేస్తున్నాడు. సలార్ 2, ఎన్టీఆర్ 31 పార్ట్ 1 అండ్ పార్ట్ 2, KGF 3 సినిమాలు ప్రశాంత్ నీల్ లిస్టులో ఉన్నాయి.

ఇవి చాలవన్నట్లు రామ్ చరణ్ తో కూడా నీల్ ఒక సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికిప్పుడు అయితే ఏప్రిల్ నెల నుంచి ఎన్టీఆర్ తో చేసే సినిమాని స్టార్ట్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యే సరికి చాలా కాలం పడుతుంది. ఇవన్నీ దాటుకోని అజిత్-ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ అవ్వాలన్నా కూడా కనీసం అయిదారు ఏళ్లకి పైగానే సమయం పడుతుంది. అసలే సినిమాలంటే ఇష్టం లేని అజిత్ అన్ని రోజులు ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా కోసం వెయిట్ చేస్తాడా? అంటే కష్టమనే చెప్పాలి. సో ఎటు చూసినా ఇప్పట్లో ప్రశాంత్ నీల్-అజిత్ సినిమా సెట్ అయ్యేలా కనిపించలేదు, ప్రస్తుతం ఇదో రూమర్ మాత్రమే.