Site icon NTV Telugu

Prashant Neel: కార్పొరేట్ బుకింగ్స్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు

Prabhas And Prashanth Neel

Prabhas And Prashanth Neel

Prashant Neel responds about Salaar’s corporate bookings in Latest Interview: సాలార్ కార్పొరేట్ బుకింగ్స్ గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్పందించారు. ప్రశాంత్ నీల్ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, సలార్ చుట్టూ ఉన్న నెగటివ్ ప్రచారాల గురించి మాట్లాడాడు. సలార్ కార్పొరేట్ బుకింగ్స్ గురించి జరుగుతున్న ప్రచారం గురించి ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ స్పందించారు. ఇటీవల, సలార్ హిందీ వెర్షన్ -షారుఖ్ ఖాన్ డంకీకి నార్త్ ఇండియాలో కలెక్షన్లు – బుకింగ్‌ల గురించి పెద్ద వివాదమే జరిగింది. షారుఖ్ ఖాన్ డంకీకి కార్పొరేట్ బుకింగ్స్ జరిపారని కొందరు కామెంట్ చేయగా సలార్ హిందీ వెర్షన్ కోసం కూడా ఇలా కార్పొరేట్ బుకింగ్స్ చేశారని ఆరోపణలు చేశారు. ఇక ఈ విషయం గురించి ప్రశాంత్ మాట్లాడుతూ లేదు ఇలాంటి నెగిటివ్ వార్తలకు తాను ప్రాముఖ్యత ఇవ్వనని, త్వరలోనే అది (నెగటివిటీ) చచ్చిపోతుందని ప్రశాంత్ నీల్ అన్నారు.

Prashanth Neel : సలార్ మూవీ రెస్పాన్స్ పై ప్రభాస్ ఫుల్ హ్యాపీ.. కానీ నేను మాత్రం..

ఇటీవల, నేషనల్ ప్లెక్స్‌లు సలార్ కోసం ఉదయాన్నే షోలు వేసి, కొంత సమయం తర్వాత వాటిని రద్దు చేసి, సలార్ చుట్టూ కొంత నెగిటివిటీ సృష్టించినట్టు చెబుతున్నారు. దీంతో అవి కార్పొరేట్ బుకింగ్స్ అంటూ షారూఖ్ అభిమానులు ప్రభాస్ అభిమానులను టార్గెట్ చేయడం కనిపిస్తోంది. సలార్ నిర్మాతలు కలెక్షన్స్ నెంబర్ల కోసం తహతహలాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. సలార్ చుట్టూ నెగిటివిటీ వ్యాప్తి చేయడానికి షారూఖ్ ఖాన్ టీం ఈ బుకింగ్‌లను ప్రారంభించిందని ప్రభాస్ అభిమానులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ విషయంపై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ సలార్ సోలో రిలీజ్ అయినా లేదా డంకీ సోలో రిలీజ్ అయినా ఇలా వివాదం తెరమీదకు వచ్చేది కాదన్నారు. మీరు అలాంటి ఆలోచనే చేసేవారు కాదని అన్నారు. ప్రేక్షకులు ఇలాంటివి అన్నీ నమ్మడానికి మూర్ఖులు ఈమె కాదన్నారు. చదవాలనుకునే ఎవరినైనా పాజిటివ్‌ల కంటే ఎక్కువ నెగటివ్స్ ఆకర్షించేలా ఉంటాయి అన్నారు. ప్రతికూలతలను వినాలనుకుంటున్నారు. నెగటివ్స్ ముగిసిపోతాయి అని పేర్కొన్న ఆయన ఇది సాలార్ వర్సెస్ డంకీ కాదు. ఇది డంకీ మరియు సలార్ అని అన్నారు.

Exit mobile version