NTV Telugu Site icon

NTRNeel : ఉప్పాడ బీచ్ లో ప్రశాంత్ నీల్.. ఎందుకోసమంటే.?

Anushkashetty

NTRNEEL

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్‌. గత కొద్ది రోజులుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మేకర్స్ ఫైనల్‌గా ఇప్పుడు షూటింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లబోతోంది.

కాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు సంబందించి అల్లర్లు , రాస్తారోకో సీన్స్ షూటింగ్ ఫినిష్ చేసాడు ప్రశాంత్ నీల్. అయితే ఇటీవల కాకినాడ సమీపంలోని ఉప్పాడ బీచ్, పరిసర ప్రాంతాలను దర్శకులను పరిశీలించి వెళ్ళాడు. షిప్పింగ్ కు తదితర సంబంధిత సీన్స్ ను ఈ బీచ్ లో షూట్ చేయనున్నాడట ప్రశాంత్ నీల్.  ప్రశాంత్ నీల్ ఉప్పాడ బీచ్ లొకేషన్స్ చూసేందుకు వచ్చిన వీడీయోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం వెస్ట్ బెంగాల్ లోని కోల్‌కతా కు వెళ్లనుంది యూనిట్. ఈ సినిమా 1960లోని వెస్ట్ బెంగాల్ నేపధ్యంలో ఉండనుంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మార్చి 30న డ్రాగన్ షూట్ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.

Also Read : The EYE : వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శృతి హాసన్ హాలీవుడ్ సినిమా ‘ది ఐ’