Pranayagodari: ఆసక్తిరేపుతున్న `ప్రణయ గోదారి` గ్లింప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pranayagodari First Glimpse Released : రిఫ్రెషింగ్ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎటువంటి పాత్రనైనా చాలా అవలీలగా పోషించి, ప్రేక్షకులను మెప్పించే డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్ రావినూతల ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ప్రణయగోదారి సినిమా గ్లింప్ల్ చూస్తుంటే.. సన్నివేశాలు.. సంభాషణలు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి.
Director Suicide: ఇండస్ట్రీలో విషాదం.. షూటింగ్ పెండింగ్ లో ఉండగా దర్శకుడు సూసైడ్
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో పెదకాపు పాత్రలో ఊరి పెద్దలాగా కనిపిస్తుండగా ఆయన చెప్పిన డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘తప్పు ఎవరు చేసినా తీర్పు ఒక్కటే’, ‘ఆకాశానికి హద్దుండదు ఈ పెదకాపు మాటకు తిరుగుండదు’……. ‘నే పుట్టిన ఈ గోదారి తల్లి మీద ఒట్టు’ అని సాయికుమార్ తన పవరఫుల్ డైలాగులతో మెస్మరైజ్ చేశాడు. ‘ప్రాణం పోయినా సహిస్తాను….భరిస్తాను …నా సహనాన్ని.. మంచితనాన్ని పరీక్షించొద్దు’ అనే డైలాగుతో చాలా కోపంగా కనిపిస్తున్నారు. గ్లింప్స్‌ను చూస్తే సినిమా మొత్తానికి సాయికుమార్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా తెలుస్తుంది. అలాగే గోదారి నది ఒడ్డున హీరో హీరోయిన్ల ఆటలు, వారి ప్రేమాయణం సన్నివేశాలు చూస్తుంటే ఈ చిత్రంలో యువతను అలరించే అంశాలు కూడా ఉన్నట్లు చెప్పవచ్చు. సదన్, ప్రియాంక ప్రసాద్, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా త్వరలో పేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
-
World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!