NTV Telugu Site icon

Prakruti Mishra: ఆఫర్ల పేరుతో ఆ నిర్మాత వాడుకున్నాడు.. ప్రేమమ్ నటి సంచలన వ్యాఖ్యలు

Prakruti Mishra

Prakruti Mishra

Prakruti Mishra Casting Couch Allegations On Producer Sanjay Nayak: సినిమా అవకాశాలు రావాలంటే.. తప్పకుండా కమిట్మెంట్లు ఇవ్వాల్సిందేనని ఇప్పటికే ఎందరో నటీమణులు ఓపెన్ అయ్యారు. కాస్టింగ్ డైరెక్టర్ నుంచి నిర్మాతలు, డైరెక్టర్ల దాకా.. ప్రతిఒక్కరూ లోబర్చుకోవాలని చూస్తారని షాకింగ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. కానీ.. మన టాలీవుడ్‌లో ఏ ఒక్కరూ కూడా ఆయా నిర్మాతలు, దర్శకుల పేర్లను బయటపెట్టలేదు. కేవలం తమకు ఎదురైన అనుభవాల గురించే చెప్పారు. బాలీవుడ్‌లో అయితే.. కొందరు ధైర్యం చేసి, ఆయా దర్శకులతో పాటు నిర్మాతల పేర్లు బయటపెట్టారు. ఇప్పుడు ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రకృతి మిశ్రా అనే హీరోయిన్ కూడా, ఇలాగే కుండబద్దలు కొట్టింది. ఒడియాలో రీమేక్ అయిన ‘ప్రేమమ్’ సినిమాలో నటించిన ఆ అమ్మడు.. ఓ నిర్మాత పేరు బయటపెడుతూ, ఆయన ఎంతోమంది అమ్మాయిల్ని వాడుకొని వదిలేశాడంటూ బాంబ్ పేల్చింది.

Allu Aravind: అల్లు అరవింద్ సరదాగా చెప్తే.. లావణ్య నిజం చేసి చూపించింది

‘‘తన సినిమాలో అవకాశం ఇప్పటిస్తానని చెప్పి.. నిర్మాత సంజయ్ నాయక్ ఎంతోమంది యువతుల్ని లోబరుచుకున్నాడు. తీరా అవసరం తీరిపోయాక, ఆ నటి ముఖం కూడా చూడడు. ఆయన ఎందరినో మోసం చేశాడు. అయితే.. నాకు ఆయన నుంచి ఇలాంటి అనుభవమైతే ఎదురుకాలేదు కానీ, ఆయన ఎంతోమంది అమ్మాయిల్ని ట్రాప్ చేశాడనే సమాచారం ఉంది. అతని సన్నిహితులు కూడా, కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టే అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశారు’’ అంటూ ప్రకృతి మిశ్రా చెప్పుకొచ్చింది. ఇలాంటి వారి టార్చర్ వల్లే తాను సినిమాలపై ఫోకస్ తగ్గించి.. రియాలిటీ షోలు చేసుకుంటూ, వాటి ద్వారా తనని తాను ప్రూవ్ చేసుకున్నానని తెలిపింది. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొంది. ప్రకృతి చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమేనని.. మరో నటి జాస్మిన్ రథ్ మద్దతు తెలిపింది. తాను కూడా సంజయ్ నాయక్ బాధితురాలినేనని ఆమె కామెంట్ చేసింది.

Devara: దేవరపై ఇంట్రెస్టింగ్ రూమర్.. ఆ హాలీవుడ్ సినిమాకు ఇన్స్‌పిరేషనా?

అయితే.. నిర్మాత సంజయ్ నాయక్ మాత్రం ప్రకృతి చేసిన ఆరోపణల్ని ఖండించాడు. ప్రకృతి, బాబుషాన్ మధ్య జరుగుతున్న వివాదంలో తాను బాబుషాన్‌కు మద్దతు పలికినందుకే.. ప్రకృతి తనపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని చెప్పాడు. ఈ వ్యవహారంపై తానను తన అడ్వొకేట్‌తో మాట్లాడానని, అతని సలహా మేరకు తాను ప్రకృతిపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నానని అన్నాడు. ఆమెతో పాటు జాస్మిన్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై వాళ్లు ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించిన ఆయన.. ఆ ఇద్దరిని కోర్టుకు లాగుతానన్నాడు.