NTV Telugu Site icon

Prakash Raj: మహాత్ముని హత్యను సమర్థించేవారు.. మళ్లీ మొదలెట్టిన ప్రకాష్ రాజ్

Prakash

Prakash

Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజు గురించి తెలియని వారుండరు. సినిమాల్లో ఆయనకు ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే .. రాజకీయంగా ఎదగాలని ప్రకాష్ రాజ్ ఎప్పటినుంచో తాపత్రయపడుతున్న విషయం తెల్సిందే. గతేడాది మా ఎలక్షన్స్ లో మంచు విష్ణుతో పోటీకి దిగి.. ఓడిపోయాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో బీజేపీపై దుమ్మెత్తిపోసేవాళ్ళలో ప్రకాష్ రాజ్ ముందు ఉంటాడు. ఇక ఈ మధ్యనే చంద్రయాన్ 3 గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేరిన విషయం తెల్సిందే. అయితే చంద్రయాన్ సక్సెస్ అవ్వదు కానీ.. నెగెటివ్ పోస్ట్ పెట్టాడు. సక్సెస్ అయ్యేసరికి ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపి తాను ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టలేదని చెప్పుకొచ్చి కవర్ చేసుకున్నాడు. అక్కడితో ఆ వివాదం ముగిసింది అనుకుంటే.. ఇప్పుడు ఇంకో వివాదానికి ప్రకాష్ రాజ్ తెరలేపాడు.

Rahul Sipliganj: పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ

రెండు రోజుల క్రితమే ప్రభుత్వం నేషనల్ అవార్డ్స్ ను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. ఈసారి తెలుగువారు.. జాతీయ అవార్డుల్లో తమ సత్తా చాటారు. ఇక మన గురించి పక్కనపెడితే.. ఈసారి ఈ అవార్డుల్లో తమిళ్ సినిమాలకు అన్యాయం జరిగిందని అభిమానులు చెప్పుకొస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా జై భీమ్ సినిమాకు అవార్డు రాకపోవడంతో ఇటు తమిళ్ అభిమానులే కాదు.. తెలుగు అభిమానులు కూడా హర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ సైతం దీనిపై స్పందించాడు. అయితే ఆయన మాటలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసినట్లు ఉండడంతో నెటిజన్స్ మరోసారి అతడిపై ఫైర్ అవుతున్నారు. ” మన మహాత్ముని హత్యను సమర్థించేవారు.. బాబాసాహెబ్‌ల రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకునేవారు.. జైభీమ్ ను సెలబ్రేట్ చేసుకుంటారా.. ? #justasking” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీంతో సినిమాపై అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు కానీ, ఈ సినిమాను అడ్డుపెట్టుకొని ఇంకో రాజకీయం చేయవద్దని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments