Site icon NTV Telugu

Pragya Jaiswal: కాంచీపురం నారాయణ సిల్క్స్ షోరూం లో బాలయ్య హీరోయిన్ సందడి

Pragya

Pragya

Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇక ఇటీవలే అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మేడ్చల్ జిల్లా పీర్జాది గూడలో సందడి చేసింది. కాంచీపురం నారాయణ సిల్క్స్ షోరూం కొత్త బ్రాంచ్ ను ప్రగ్యా ప్రాంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “పెళ్లి పట్టు చీరలకు కాంచీ పురం నారాయణ సిల్క్స్ మొదటి ఛాయిస్. ఇక్కడ అన్నిరకాల చీరలు అందుబాటులో ఉన్నాయి. పెళ్లి చీరలు, పార్టీ చీరలు ఎంతో అద్భుతంగా సరసమైన ధరలలోనే దొరుకుతున్నాయి. పార్టీ ఏదైనా ఇక్కడ మంచి చీరలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో 4 బ్రాంచ్ లు ఉన్న నారాయణ సిల్క్స్ 40 బ్రాంచ్ లు ఎదగాలని కోరుకుంటున్నాను. నన్ను ఈ షోరూమ్ ను ప్రారంభించడానికి పిలిచిన యాజమానులు సురేష్, అభినవ్, కేశవ్ గుప్త, రాకేష్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని చెప్పుకొచ్చింది.

కాంచీపురం నారాయణ సిల్క్స్ యాజమానులు సురేష్, అభినవ్, కేశవ్ గుప్త, రాకేష్ మాట్లాడుతూ ఇక్కడ అన్ని శుభకార్యాలకు సంబంధించిన వస్త్రాలు తమ వద్ద లభిస్తాయని, తమ ఇంట్లో జరిగే పండుగలకు ఎలాంటి వస్త్రాలు కొనుగోలు చేస్తామో.. ఇక్కడికి వచ్చే ప్రతి కస్టమర్ లు అలాంటి వస్త్రాలనే అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇక వస్త్ర దుకాణానికి ప్రగ్యా వచ్చిందని తెలియడంతో అభిమానులు ఆమెను చూడడానికి తరలివచ్చారు. ఇక ప్రస్తుతం ప్రగ్యా కెరీర్ విషయానికొస్తే పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.

Exit mobile version