Site icon NTV Telugu

‘Dude’ Trailer : ప్రదీప్ ‘డ్యూడ్’ ట్రైలర్ రిలీజ్.. చూస్తుంటే మళ్ళీ హిట్ కొట్టేలా ఉన్నాడే

Dude Trailor

Dude Trailor

తమిళ ఇండస్ట్రీలో “లవ్ టుడే” సినిమాతో యూత్ ఐకాన్‌గా నిలిచిన ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు మరోసారి తన సొంత స్టైల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కోలీవుడ్‌లో మాత్రమే కాకుండా, టాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రదీప్, కొత్తగా చేస్తున్న సినిమా ‘డ్యూడ్’. దీపావళి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించగా, తాజాగా విడుదలైన ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ట్రైలర్ చూస్తుంటే, ప్రదీప్ మళ్లీ తన స్టైలిష్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించేందుకు రెడీగా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోంది.

Also Read : Vijay Sethupathi : పూరి–విజయ్ సేతుపతి ప్రాజెక్ట్‌కి.. మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

ట్రైలర్‌లో ప్రదీప్ యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్నీ సమపాళ్లలో కనిపిస్తున్నాయి. తన సిగ్నేచర్‌ స్టైల్‌కి తోడు, కొత్తగా చూపించిన మాస్ అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మమితా బైజు, నేహా శెట్టితో ప్రదీప్ కెమిస్ట్రీ యూత్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయేలా ఉంది. అలాగే కమెడియన్ సత్య, శరత్ కుమార్ వంటి నటుల ప్రెజెన్స్ కూడా సినిమాలో వినోదాన్ని మరింత పెంచనున్నాయి. కథలో లవ్ ట్రాక్‌లు, థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్, సాసీ కామెడీ సీక్వెన్స్‌లు కలిసి ఈ దీపావళి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం పక్క.

ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన సాయి అభ్యంకర్ అందించిన బీట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ విలువలు, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ టాప్ గా ఉన్నాయి. మొత్తం మీద, ఈ దీపావళికి యువ హీరో ప్రదీప్ రంగనాథ్ తన ‘డ్యూడ్’ అవతారంతో మళ్లీ థియేటర్లలో మ్యాజిక్ చేయబోతున్నాడని ట్రైలర్ చెప్పేస్తోంది.

 

Exit mobile version