Site icon NTV Telugu

The Raja Saab : ది రాజా సాబ్ మ్యూజికల్ జర్నీ మొదలు.. ఫస్ట్ సింగిల్ డేట్ ఔట్”

Rajasab

Rajasab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రతి సినిమా పట్ల అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన, ప్రస్తుతం దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ది రాజా సాబ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హారర్, ఫాంటసీ, ఎంటర్‌టైన్‌మెంట్ వస్తున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లోనే మరో వినూత్నమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చి అభిమానుల్లో ఎక్సయిట్‌మెంట్ పెంచేశారు.

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించిన ప్రకారం, “ది రాజా సాబ్” ఫస్ట్ సింగిల్‌ను ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయనున్నారు. ప్రతి సంవత్సరం తన బర్త్‌డేను అభిమానులు భారీగా సెలబ్రేట్ చేసుకునే ప్రభాస్ ఈసారి కూడా సింగిల్ రిలీజ్‌తో డబుల్ జోష్ ఇవ్వబోతున్నాడు. మ్యూజిక్ లవర్స్, ఫ్యాన్స్ అందరూ ఈ అప్‌డేట్ విని ఆనందంలో మునిగిపోయారు. ఇదే కాకుండా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ట్రైలర్‌ను “కాంతార 1” రీ రిలీజ్ సందర్భంగా రిలీజ్ చేయాలన్న ప్లాన్ మేకర్స్ చేస్తున్నారని సమాచారం. అంటే అక్టోబర్‌లో ప్రభాస్ అభిమానులకు రెండు పెద్ద ట్రీట్స్ ఖాయం అయినట్టే. ఒకవైపు మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అవుతుంటే, మరోవైపు ట్రైలర్‌తో సినిమాపై బజ్‌ను ఆకాశానికెత్తేలా మేకర్స్ వ్యూహం వేసినట్టుగా తెలుస్తోంది.

థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆయన స్టైల్‌కే తగ్గట్టుగా మాస్ బీట్‌లు, ఎమోషనల్ ట్యూన్స్, ఫాంటసీ వాతావరణానికి తగ్గ బిజారే సౌండ్స్ అన్నీ కలిపి ఒక సాలిడ్ ఆల్బమ్ రాబోతుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు థమన్ మ్యూజిక్ మేజిక్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ అవుతుందని అంచనా. ఇక దర్శకుడు మారుతీ ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచాడు. అయితే ఈసారి హారర్ ఫాంటసీ జానర్‌ని టచ్ చేయడం ఆయన కెరీర్‌లోనే కొత్త ప్రయోగం. ప్రభాస్‌ని ఇలాంటి యూనివర్సల్ యాపీల్ ఉన్న కాన్సెప్ట్‌లో చూపించబోతున్నందుకు అంచనాలు మరింతగా పెరిగాయి. మొత్తానికి, “ది రాజా సాబ్” విషయంలో అక్టోబర్ నుంచే హంగామా మొదలవుతుందని చెప్పవచ్చు. బర్త్‌డే సాంగ్, ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ జోరుగా సాగి సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటడం ఖాయం. ప్రభాస్ అభిమానులు మాత్రం ఈసారి మామూలు హిట్ కాదు, పాన్ ఇండియా లెవెల్‌లో రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్ కోసం రెడీ అవుతున్నారు.

Exit mobile version