SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ

Spirit Kannada Rights

Spirit Kannada Rights

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది స్పిరిట్. కాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ డీల్స్ క్లోజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అఫీషియల్ బిజినెస్ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు.

‘స్పిరిట్’ సినిమా కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దిగ్గజ పంపిణీ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్తో ప్రతిష్టాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ రెండు దిగ్గజ సంస్థలు కలిసి కర్ణాటక వ్యాప్తంగా ‘స్పిరిట్’ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రభాస్‌కు కర్ణాటకలో భారీ మార్కెట్ ఉంది. గతంలో బాహుబలి, సలార్, కల్కి వంటి చిత్రాలతో అక్కడ రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు స్పిరిట్ చిత్రంతో కన్నడలో సరికొత్త ఆల్ టైమ్ బాక్సాఫీస్ బెంచ్‌మార్క్‌లు రికార్డులు క్రియేట్ చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా వెల్లడించింది. టి-సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027 మార్చి 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.