Site icon NTV Telugu

Salaar: 5 మిలియన్ డాలర్స్… మూడు రోజుల్లో కెరీర్ బెస్ట్

Salaarr

Salaarr

రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగ్ తో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసాడు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ ప్రకారం రెండు రోజుల్లో దాదాపు 330 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది సలార్ సినిమా. డే 2 అలొమ్స్ 150 కోట్ల కలెక్షన్స్ రావడంతో 2023లో రిలీజైన మిగిలిన సినిమాల డే 1 కన్నా సలార్ డే 2 ఎక్కువ అయ్యింది. ఫైనల్ రిపోర్ట్స్ హోంబలే ఫిల్మ్స్ నుంచి ఇంకా అఫీషియల్ గా బయటకు రాలేదు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ అఫీషియల్ గా బయటకి రాలేదు కానీ ఓవర్సీస్ రిపోర్ట్ మాత్రం వచ్చేసింది. నార్త్ అమెరికాలో సలార్ సినిమా ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది.

ప్రీమియర్స్, డే 1 కలిపి సలార్ సినిమా 4 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. రెండో రోజు ఎండ్ అయ్యే సరికి సలార్ సినిమా నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసింది. ఈరోజు ఎండ్ అయ్యే లోపు సలార్ సినిమా 5.5 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉండే అవకాశం ఉంది. ఇది ప్రభాస్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ డే ప్రీమియర్ కలెక్షన్స్ అనే చెప్పాలి. నార్త్ అమెరికాలో సలార్ సినిమా ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేసింది. సాలిడ్ నంబర్ ఆఫ్ షోస్ సలార్ సినిమాకి దక్కేలా చేసిన ప్రత్యంగిరా సినిమాస్ సోషల్ మీడియాలో హోంబలే ఫిల్మ్స్ కన్నా యాక్టివ్ గా ఉండి ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నారు. బుల్డోజర్ బాక్సాఫీస్ ని దున్నేస్తుంది అంటూ ట్వీట్స్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ ప్రభాస్ కి నాన్ స్టాప్ ఎలివేషన్స్ ఇస్తూనే ఉన్నారు.

Exit mobile version