Site icon NTV Telugu

Salaar: బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి… బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే

Salaaaar

Salaaaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ‘సలార్’. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. బాహుబలి తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న ప్రభాస్ సలార్ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయబోతున్నాడు. అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా ట్రైలర్ రిలీజ్ తో ఒక్కసారిగా ఇండియాస్ హాట్ టాపిక్ అయ్యింది. ట్రైలర్ తో ప్రశాంత్ నీల్ అండర్ ప్లే చేస్తూ ప్రభాస్ ని లేట్ గా ఎంట్రీ ఇచ్చేలా చేసాడు. ‘దేవా’ అనే పేరు నుంచి ప్రభాస్ రివీల్ అవ్వడం అక్కడి నుంచి మిర్చి, ఛత్రపతి రేంజ్ మాస్ ఫైట్స్ తో ప్రభాస్ అగ్రెసివ్ గా కనిపించడం ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇలాంటి ప్రభాస్ ని ఈ మధ్య కాలంలో మాత్రం చూడలేదు. సింపుల్ గా చెప్పాలి అంటే వింటేజ్ ప్రభాస్ ని ఒక్క ట్రైలర్ లో చూపించాడు ప్రశాంత్ నీల్.

డిజిటల్ రికార్డ్స్ ని బ్రేక్ చేసే పనిలో ట్రైలర్ ఉండగా… బాక్సాఫీస్ రికార్డులని టార్గెట్ చేస్తూ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. సలార్ ప్రీబుకింగ్స్ డిసెంబర్ 15 నుంచి ఓపెన్ అవనున్నాయని హోంబలే ఫిల్మ్స్ అనౌన్స్ చేసింది. బుకింగ్స్ ఓపెన్ అవ్వడం ఆలస్యం పాన్ ఇండియా ఆడియన్స్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఫుల్ జోష్ లో ఉంటారు. ప్రీబుకింగ్స్ లో సలార్ కొత్త రికార్డ్ ని క్రియేట్ చేయడం గ్యారెంటీ. ఇప్పుడున్న హైప్ కి ఒక సాలిడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా పడితే సలార్ బుకింగ్స్ ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే కొత్త చరిత్ర సృష్టిస్తుంది.

Exit mobile version