పాన్ ఇండియా స్టార్ ప్రభాస్… డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘సలార్’. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీపై హ్యూజ్ హైప్ ఉంది. షారుఖ్ ఖాన్ తో క్లాష్ కి కూడా వెనకాడట్లేదు అంటే సలార్ సినిమాపై మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా రూపొందిన సలార్ సినిమా టీజర్ ని మేకర్స్ ఇప్పటికే బయటకి వదిలారు. ఈ టీజర్ లో ప్రభాస్ ని డైనోసర్ తో పోలుస్తూ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ కి డిజిటల్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయ్యాయి. సలార్ టీజర్ లో బాలీవుడ్ యాక్టర్ టిన్ను ఆనంద్, ప్రభాస్ గురించి డైలాగ్ చెప్తూ ఇచ్చిన ఎక్స్ప్రెక్షన్స్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంటాయి.
ఈరోజు టిన్ను ఆనంద్ బర్త్ డే కావడంతో హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి స్పెషల్ విషెష్ వచ్చాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా టిన్ను ఆనంద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు. టిన్ను ఆనంద్ తెలుగులో నటించడం ఇదే మొదటిసారి కాదు… బాలయ్య నటించిన క్లాసిక్ ఆదిత్య 369, కమల్ హాసన్ ఆల్ టైమ్ బెస్ట్ మూవీ నాయకుడు, పుష్పక విమానం, బాంబే, ఘటోత్కచుడు, అంజి సినిమాల్లో నటించాడు. అంజి తర్వాత తెలుగులో బాగా గ్యాప్ తీసుకున్న టిన్ను ఆనంద్… చాలా ఏళ్లకి ప్రభాస్ సాహో సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. సాహో తర్వాత సీతారామాం, ఇప్పుడు సలార్ సినిమాలో నటించాడు. ఇంతక ముందు చేసిన సినిమాలు టిన్ను ఆనంద్ కి తెలుగు ఆడియన్స్ కి ఎంత దగ్గర చేశాయో అంతకన్నా ఎక్కువగా సలార్ టీజర్ లోని డైనోసర్ డైలాగ్ దగ్గర చేసింది. మరి సలార్ తర్వాత టిన్ను ఆనంద్ తెలుగులో మరింత బిజీ అవుతాడేమో చూడాలి.
Happy birthday to the versatile and evergreen #TinnuAnand. #Salaar #SalaarCeaseFire pic.twitter.com/UdzOcMdlr1
— Salaar (@SalaarTheSaga) October 12, 2023