Site icon NTV Telugu

Prabhas: మోకాలి సర్జరీ తరువాత ప్రభాస్ ఫస్ట్ ఫోటో ఇదే!

Prabhas Knee Surgery Photo

Prabhas Knee Surgery Photo

Prabhas Landed in Hyderabad after a Long Vacation: బాహుబలి తర్వాత వరుసగా ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఆది పురుష్ సినిమా తర్వాత సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ విఎఫ్ఎక్స్ వర్క్స్ లేట్ అవ్వడంతో డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేశారు. ఇక ఆ మధ్య ఆయన మోకాలి చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఆయన విదేశాల్లోనే రెస్ట్ తీసుకుంటూ వచ్చారు. ఇక సుదీర్ఘమైన వెకేషన్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ఈ రోజు హైదరాబాదులో ల్యాండ్ అయ్యారు. వచ్చేనెల 22వ తేదీన సలార్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు.

NBK 109: బాలకృష్ణ – బాబీ పని మొదలెట్టేశారు!

ప్రమోషన్స్ లో భాగంగా ఒక భారీ టీజర్ రిలీజ్ ఈవెంట్ ముందుగా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి దాదాపు అన్ని భాషల మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ప్రభాస్ సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకపక్క ప్రశాంత్ నీల్ కి ఉన్న కేజిఎఫ్ క్రేజ్ తో పాటు ప్రభాస్ కి స్వతహాగానే ఉన్న ప్యాన్ ఇండియా క్రేజ్ తోడవడంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నాడు. మరొక క్రూరమైన పాత్రలో పృథ్వీరాజ్ తండ్రిగా జగపతిబాబు నటిస్తున్నారు. ఇక సుదీర్ఘమైన వెకేషన్ తర్వాత ప్రభాస్ హైదరాబాద్ లో ల్యాండ్ అవడంతో డైనోసార్ బరిలో దిగింది అంటూ ప్రభాస్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version