NTV Telugu Site icon

Prabhas: రాజువయ్యా.. మహారాజువయ్యా.. ప్రతి ఏటా 100 మంది పిల్లలకు స్కూల్ ఫీజులు!!

Prabhas Craze

Prabhas Craze

Prabhas pays fee of 100 Students every year in Hyderabad: కేరళలో జరిగిన విధ్వంసానికి అక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయనాడ్ లో జరిగిన విధ్వంసానికి వందల సంఖ్యలో ప్రజలు మరణించడమే కాదు వందల సంఖ్యలో గాయపడ్డారు. కొంతమంది అయితే కనిపించడం లేదు. ఇక అక్కడ జరిగిన నష్టాన్ని కొంతలో అయినా భర్తీ చేయాలని ఉద్దేశంతో సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొంత విరాళాలను కేరళ ప్రభుత్వానికి అందిస్తున్నారు. అందులో భాగంగా ప్రభాస్ ఇప్పటివరకు సౌత్ లోనే అత్యధికంగా రెండు కోట్లు ప్రకటించాడు. ఇప్పుడు ప్రభాస్ గురించి మరో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Game Changer: గేమ్ ఛేంజర్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్.. రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?

అదేంటంటే ప్రభాస్ ప్రతి ఏటా మాదాపూర్ లోని ఒక ప్రముఖ స్కూల్లో చదువుతున్న వంద మంది ప్రతిభవంతులైన విద్యార్థులకు తన సొంత ఖర్చులతో ఫీజు చెల్లిస్తాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటివరకు ప్రభాస్ సన్నిహితులు కూడా బయట పెట్టలేదు కానీ అనుకోకుండా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఇంత సహాయం చేస్తూ కూడా దాన్ని పబ్లిసిటీ చేసుకోకుండా ఉండే ప్రభాస్ గొప్ప హృదయాన్ని అందరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. రాజువయ్య మహారాజువయ్య అంటూ ప్రభాస్ ని కీర్తిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ క్రేజ్ కూడా ఖండాంతరాలు దాటి ముందు ముందుకు దూసుకుపోతోంది. కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన సూపర్ హిట్ కొట్టాడు. ఇక ముందు ముందు కూడా ప్రేక్షకులను ఇతర సినిమాలతో పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.

Show comments