Site icon NTV Telugu

Prabhas: ఆట్… ఇండియన్ టామ్ క్రూజ్

Prabhas

Prabhas

ఈ జనరేషన్ లో పాన్ ఇండియా అనే పదాన్ని సినీ అభిమానులకి పరిచయం చేసిన హీరో ‘ప్రభాస్’. ఆరు అడుగుల ఎత్తుతో, పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసిన కటౌట్ తో మాస్ సినిమాలతో బాక్సాఫీస్ కే బొమ్మ చూపించేలా ఉంటాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ప్రభాస్, ఇండియా బౌండరీలు దాటి పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ ని పాన్ వరల్డ్ రేంజులో చూపిస్తూ ‘ప్రాజెక్ట్ K’ సినిమా చేస్తున్నాడు. హై ఎండ్ గ్రాఫిక్ వర్క్ తో, నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ తో ప్రాజెక్ట్ K సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతుంది. 2024లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని ‘కామిక్ కాన్’లో రిలీజ్ చేస్తున్నారు. మరో కొన్ని గంటల్లో ప్రాజెక్ట్ K రేంజు ఏంటో? ఏ వరల్డ్ లో అది తెరకెక్కిందో ప్రపంచానికి తెలియనుంది.

ప్రాజెక్ట్ K వరల్డ్ ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రభాస్ ఇప్పటికే రీచ్ అయ్యాడు. శాన్ డియాగో నుంచి ప్రభాస్ ఫొటోస్ బయటకి వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ ఫొటోస్ తో మోగిపోతుంది. స్టైల్ గా ప్రభాస్ కనిపిస్తే ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ కటౌట్ ని చూసి ఇండియన్ టామ్ క్రూజ్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. బ్లూ సూటులో ప్రభాస్ మస్త్ ఉన్నాడు. జనరల్ గా ప్రభాస్ లూజ్ బట్టలు వేసుకొని, హెడ్ బ్యాండ్ పెట్టుకొని కనిపిస్తాడు. ఎక్కువగా ఇదే లుక్ లో ఉండే ప్రభాస్, చాలా రేర్ గా తన స్వాగ్ అండ్ స్టైల్ తో కనిపిస్తూ ఉంటాడు. ఆ అరుదైన సంఘటన ఇప్పుడు శాన్ డియాగోలో జరుగుతూ ఉంది. ఈరోజు ప్రాజెక్ట్ K గ్లిమ్ప్స్ తో ప్రభాస్ అనే పేరు ప్రపంచానికి పరిచయం అవుతుంది.

Exit mobile version