NTV Telugu Site icon

Prabhas : యూరప్ కు వెళ్ళబోతున్న ప్రభాస్ .. సినిమా కోసం కాదు..

Prabhas

Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు.. ఈయన నటించిన తాజా మూవీ కల్కి సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా నుంచి నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది… భారీ యాక్షన్స్ తో సినిమా రాబోతుంది.. అయితే ప్రభాస్ తన సినిమా విడుదలకు ముందు ట్రిప్ లకు వెళ్లడం తెలిసిందే.. ఈ సినిమా విడుదలకు ముందు కూడా ట్రిప్ కు వెళ్లనున్నాడని వార్త వినిపిస్తుంది..

కల్కి సినిమా జూన్ 27 న విడుదల కాబోతుంది.. ఈ సినిమాను స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే ప్రభాస్ మాత్రం సినిమా రెస్పాన్స్ ను దగ్గరుండి చూడకుండా సినిమా విడుదల అవ్వడానికి ముందే యూరప్ ట్రిప్ కు వెళ్ళబోతున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఈ వార్తల్లో నిజమేంత ఉందో కానీ ఈ వార్త మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.. మరి డార్లింగ్ ఎప్పుడూ వెళతాడన్నది మాత్రం తెలియడం లేదు.. త్వరలోనే దీని పై అనౌన్స్మెంట్ రాబోతుందని సమాచారం..

ఇక కల్కి సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీగా అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. విజువల్స్ విషయానికొస్తే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాడనే టాక్ ను అందుకున్నాడు.. అద్భుతమైన ప్రపంచానికి తీసుకెళ్లాడు.. మరి సినిమా విడుదల తర్వాత ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, మాళవిక అయ్యర్, అనబెల్లా దీపికా పదుకొనే వంటి స్టార్స్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు..