Prabhas Movies : డిసెంబర్ 3న ‘ఫౌజీ’ విడుదల.. ప్రభాస్‌ను నమ్మొచ్చా.. కన్ఫర్మ్గా వస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ చేతిలో ఎప్పుడూ కనీసం 3 సినిమాలు లైన్లో ఉంటుంటాయి. ఒక సినిమా షూటింగ్లో ఉండగానే మరో సినిమా చర్చలు, ఇంకొక సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు నడుస్తుంటాయి. ఇలాంటి బిజీ షెడ్యూల్స్ వల్ల ఒక సినిమాకు కేటాయించిన డేట్స్ మారితే అది ఆటోమేటిక్‌గా మిగిలిన ప్రాజెక్టులపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ప్రభాస్ సినిమాలంటే “రిలీజ్ వాయిదా గ్యారెంటీ” అనే ముద్ర పడిపోయింది. గతంలో సలార్, కల్కి చిత్రాల విషయంలోనూ పలుమార్లు వాయిదాలు పడిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు ఫౌజీ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ ఇప్పటివరకు దాదాపు 70% నుండి 75% వరకు పూర్తయింది. అంటే ఇంకా 30% షూటింగ్ బాలెన్స్ ఉంది. ఇందులో 3 భారీ యాక్షన్ సీక్వెన్స్ టాకీ పార్ట్‌తో పాటు మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. డిసెంబర్ 3 రిలీజ్ అంటే.. పోస్ట్-ప్రొడక్షన్, భారీ గ్రాఫిక్స్ పనుల కోసం కనీసం 2-3 నెలల సమయం పడుతుంది. మిగిలిన 30% షూటింగ్‌ను రాబోయే 3-4 నెలల్లోనే పూర్తి చేసిఅనుకున్న సమయానికి సినిమాను సిద్ధం చేయడం హను రాఘవపూడికి ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి.
Also Read
- Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
- The Odyssey: 'ది ఒడిస్సీ' ప్రీ రివ్యూ ..
- The Odyssey: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న 'ది ఒడిస్సీ' టికెట్లు! లక్షకు పైగా..
- Kiran Abbavaram: 'మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..' ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
మరోవైపు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే మోస్ట్ అవేటెడ్ పోలీస్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్‘ 2027 మార్చి 5న రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారంప్రభాస్ స్పిరిట్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ఫౌజీ షూటింగ్ చేస్తున్నాడు ప్రభాస్ దాంతో ‘స్పిరిట్’ షూటింగ్ పనులు ఆలస్యమవుతూ వస్తోంది. అసలు షూటింగే సరిగ్గా పట్టాలెక్కకుండా ఎప్పటికప్పుడు డిలే అవుతుండటంతో.. 2027 మార్చి 5 నాటికి సినిమా సిద్ధం కావడం అసాధ్యమని చిత్ర వర్గాలు లోలోపల చర్చించుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Prabhas Movies : డిసెంబర్ 3న ‘ఫౌజీ’ విడుదల.. ప్రభాస్‌ను నమ్మొచ్చా.. కన్ఫర్మ్గా వస్తాడా?
-
COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!