Prabhas Movies : డిసెంబర్‌ 3న ‘ఫౌజీ’ విడుదల.. ప్రభాస్‌ను‌ నమ్మొచ్చా.. కన్ఫర్మ్‌గా వస్తాడా?

Prabhas Movies

Prabhas Movies

ప్రభాస్ చేతిలో ఎప్పుడూ కనీసం 3 సినిమాలు లైన్‌లో ఉంటుంటాయి. ఒక సినిమా షూటింగ్‌లో ఉండగానే మరో సినిమా చర్చలు, ఇంకొక సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు నడుస్తుంటాయి. ఇలాంటి బిజీ షెడ్యూల్స్ వల్ల ఒక సినిమాకు కేటాయించిన డేట్స్ మారితే అది ఆటోమేటిక్‌గా మిగిలిన ప్రాజెక్టులపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ప్రభాస్ సినిమాలంటే “రిలీజ్ వాయిదా గ్యారెంటీ” అనే ముద్ర పడిపోయింది. గతంలో సలార్, కల్కి చిత్రాల విషయంలోనూ పలుమార్లు వాయిదాలు పడిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఫౌజీ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ ఇప్పటివరకు దాదాపు 70% నుండి 75% వరకు పూర్తయింది. అంటే ఇంకా 30% షూటింగ్ బాలెన్స్ ఉంది. ఇందులో 3 భారీ యాక్షన్ సీక్వెన్స్ టాకీ పార్ట్‌తో పాటు మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది.  డిసెంబర్ 3 రిలీజ్ అంటే.. పోస్ట్-ప్రొడక్షన్, భారీ గ్రాఫిక్స్ పనుల కోసం కనీసం 2-3 నెలల సమయం పడుతుంది. మిగిలిన 30% షూటింగ్‌ను రాబోయే 3-4 నెలల్లోనే పూర్తి చేసిఅనుకున్న సమయానికి సినిమాను సిద్ధం చేయడం హను రాఘవపూడికి ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి.

మరోవైపు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే మోస్ట్ అవేటెడ్ పోలీస్ యాక్షన్ డ్రామా స్పిరిట్2027 మార్చి 5న రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారంప్రభాస్ స్పిరిట్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ఫౌజీ షూటింగ్ చేస్తున్నాడు ప్రభాస్ దాంతో ‘స్పిరిట్’ షూటింగ్ పనులు ఆలస్యమవుతూ వస్తోంది. అసలు షూటింగే సరిగ్గా పట్టాలెక్కకుండా ఎప్పటికప్పుడు డిలే అవుతుండటంతో.. 2027 మార్చి 5 నాటికి సినిమా సిద్ధం కావడం అసాధ్యమని చిత్ర వర్గాలు లోలోపల చర్చించుకుంటున్నాయి.