NTV Telugu Site icon

Prabhas Fans: ఇలా తగులుకున్నారు ఏంటి?

Prabhas

Prabhas

బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ ఏ సినిమా చేసినా, ఏ డైరెక్టర్ తో వర్క్ చేసినా, ఏ జోనర్ లో సినిమా చేసినా ప్రతి మూవీకి కామన్ గా జరిగే ఒకేఒక్క విషయం ‘అప్డేట్ లేట్ గా రావడం’. ప్రభాస్ సినిమా అంటే చాలు అప్డేట్ బయటకి రాదులే అనే ఫీలింగ్ లోకి వచ్చేసారు సినీ అభిమానులు. ఈ తలనొప్పితో ప్రభాస్ ఫాన్స్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో అప్డేట్ కోసం రచ్చ చేస్తుంటారు. ముఖ్యంగా యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అంటే చాలు అప్డేట్ బయటకి రావడానికి సంవత్సరాలు పడుతుంది అని ఫిక్స్ అయిన ఫాన్స్, చూసి చూసి సోషల్ మీడియాలో అప్డేట్ ఇవ్వండి అంటూ ట్రెండ్ చేస్తారు. సరిగ్గా ఇలాంటిదే ఇప్పుడు మరోసారి జరిగింది. #wewantprabhasfilmupdates అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్విట్టర్ ని షేక్ చేస్తున్నారు ప్రభాస్ ఫాన్స్.

ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ K, మారుతీ సినిమా, ఆదిపురుష్, స్పిరిట్, సిద్దార్థ్ ఆనంద్-హృతిక్ రోషన్ సినిమా… ఇలా వరస ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నాడు. ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, ఏ మూవీ షూటింగ్ షెడ్యూల్ బ్రేక్ లో ఉందో, ఏ మూవీ ఎన్ని పార్ట్స్ గా రిలీజ్ అవుతుందో, దేని అప్డేట్ ఎప్పుడు బయటకి వస్తుందో ఎవరికీ తెలియదు. ప్రభాస్ సినిమాలకే ఎందుకు ఇలా జరుగుతుంది? మా హీరోకే ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్పుకోవడానికి పాన్ ఇండియా సినిమాల భారి లైనప్ ఉంది కానీ చూడడానికి ఒక్క పోస్టర్ కూడా బయటకి రావట్లేదు అంటూ ప్రభాస్ ఫాన్స్ బాధ పడుతున్నారు. ఈ బాధకి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో? అప్డేట్ ఇచ్చిన ఆ బాధని ఎవరు తగ్గిస్తారో తెలియదు కానీ ప్రభాస్ ఫాన్స్ కి ఉన్నంత ఓపిక మరే ఇతర హీరో అభిమానికి ఉండదు అనేది వాస్తవం. సలార్, ప్రాజెక్ట్ K సినిమాలు పాన్ ఇండియా హిట్స్ గా నిలిస్తే ప్రభాస్ ఫాన్స్ పడుతున్న బాధ జస్టిఫై అయినట్లు ఉంటుంది.

Show comments