NTV Telugu Site icon

Prabhas Fans: బాబోయ్… ఆమె అస్సలు వద్దు దయచేసి ఓకే చేయకండి

Prabhas Fans

Prabhas Fans

శ్రీలీల… ఈ మధ్య కాలంలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. తెలుగు అమ్మాయి స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం తెచ్చుకోవడం గొప్ప విషయం. ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా యాక్ట్ చేసిన శ్రీలీల నెక్స్ట్ కూడా పెద్ద సినిమాలే చేసే అవకాశం ఉంది. అయితే శ్రీలీల పేరు వినగానే బాబోయ్ మాకు వద్దు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్… నెక్స్ట్ హను రాఘవపూడితో సినిమా చేయబోతున్నాడు. యుద్ధంతో కూడిన ప్రేమకథగా హను రాఘవపూడి ఈ సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని ఫైనల్ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది.

ఈ వార్త ఎక్కువగా వినిపించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. శ్రీలీల ప్రభాస్ పక్కన వద్దంటూ ఫ్యాన్స్ రచ్చ చేసి, ట్రెండ్ కూడా చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ శ్రీలీలపై నెగటివ్ ట్రెండ్ చేయడానికి కారణం ఈమధ్య ఆమె నటించిన సినిమాలు అంతంతమాత్రంగానే ఉండడం. భగవంత్ కేసరితో సినిమాతో శ్రీలీల ఓకె అనిపించుకున్నప్పటికీ… ఆమె నటించిన ఆదికేశవ, స్కంద, గుంటూరు కారం సినిమాలు సోసోగానే ఆడాయి. ఈ సినిమాల్లో శ్రీలీల పాత్రలకి ఇంపార్టెన్స్ కూడా పెద్దగా లేదు. కేవలం డాన్స్ కోసమే శ్రీలీలని తీసుకున్నట్లు ఉన్నారేమో అనిపించేలా కేవలం పవర్ ఫుల్ డాన్స్ కోసమే శ్రీలీలని కాస్ట్-ఇన్ చేసారు. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీలీల కెరీర్ కే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అయితే హను రాఘవపూడి సినిమాల్లో హీరోయిన్స్ కి చాలా కీ రోల్స్ ఉంటాయి. సో ఒకవేళ శ్రీలీలకి నిజంగానే ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వస్తే ఆమె కెరీర్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చినట్లే.

Show comments