NTV Telugu Site icon

Pawan Kalyan Vs Prabhas: పవన్ ను ఫ్యాన్ ను హత్య చేసిన ప్రభాస్ ఫ్యాన్.. అది మార్చలేదని

Pawan

Pawan

Pawan Kalyan Vs Prabhas: అభిమానం అనేది మహా చెడ్డది. ఒకరిపై మనస్ఫూర్తిగా ఒకసారి అభిమానం పెంచుకొంటే.. అది చచ్చేవరకు పోదు. ఇది మనిషి నైజం. కానీ, అభిమానం హద్దు మీరితే..వచ్చే పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయి. అందుకు నిదర్శనమే ఈ ఘటన. సాధారణంగా హీరోల ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ జరగడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి.. ఆ వార్స్ మరింత ఘోరంగా మారిపోయాయి. తమ ఫేవరేట్ హీరోను.. వేరొక హీరో ఫ్యాన్ ట్రోల్స్ చేయడం.. వారు వీరికి కౌంటర్లు ఇవ్వడం.. సోషల్ ఇండియాలో చూస్తూనే ఉంటాం. మీమ్స్ ద్వారా కొట్టుకోవడం చూసాం.. ఇంకా దానికి మించి రారా చూసుకుందాం అని అడ్రెస్స్ లు పెట్టుకొని వార్నింగ్ లు ఇవ్వడం కూడా చూసాం. కానీ, ఇలా తన ఫేవరేట్ హీరోను ఏదో ఒక మాట అన్నాడని హత్య చేసిన ఘటన మొదటిసారివింటున్నాం. దీన్ని మించిన పిచ్చితనం ఇంకొకటి లేదని అంటున్నారు నెటిజన్లు. మేము మేము బాగానే ఉంటాం.. మీరు మీరు బావుండాలి అని ఎంతమంది హీరోలు ఎన్నిసార్లు ఎన్నివిధాలుగా చెప్తున్నా ఇలాంటి పిచ్చి ఫ్యాన్స్ వివాదం లేదు. అభిమానం అంటే వారు చేసిన మంచి పనులను ముందుకు తీసుకెళ్లాలి.. వారు తీసిన సినిమాను సపోర్ట్ చేయాలి. అంతేకానీ వారి మీద ఉన్న అభిమానంతో కన్న తల్లిదండ్రులకు, కట్టుకున్నవారికి కడుపుకోతలను మిగల్చకూడదు.

Kiara Advani: పెళ్లి తరువాత కియారా న్యూడ్ ఫోటో.. బయటపడింది ఇలా

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి అత్తిలిలో హరి కుమార్, కిషోర్ అనే ఇద్దరు వ్యక్తులు భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. ఒకే దగ్గర ఉండడంతో రోజు మాట్లాడుకుంటూ ఉంటారు. కిషోర్, పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని.. హరి, ప్రభాస్ కు వీరాభిమాని. అయితే నిన్న కిషోర్.. పవన్ కళ్యాణ్ వీడియోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు. అది చూసిన హరి.. పవన్ కళ్యాణ్ వాట్సాప్ స్టేటస్ ను ఎందుకు పెట్టావ్.. అది తీసేసి ప్రభాస్ స్టేటస్ ను పెట్టమని బలవంతపెట్టాడు. వెంటనే కిషోర్.. తానూ మార్చనని చెప్తూ.. ప్రభాస్ ను తిట్టినట్లు మాట్లాడాడు. దీంతో కోపంతో రగిలిపోయిన హరి.. మా హీరోనే తిడతావా అంటూ పక్కనే ఉన్న సెంట్రిక్ కర్రతో కిషోర్ తలపై గట్టిగా మోదాడు. దెబ్బ గట్టిగా తగలడంతో కిషోర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అసలు తామెప్పుడూ కలవని, చూడని హీరోల కోసం తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు ఈ ఇద్దరు. ఇక విషయం తెలియడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హరిని అరెస్ట్ చేశారు.

Show comments