#PrabhasDP : 7 ఏళ్ల తర్వాత డీపీ మార్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియా షేక్..షేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ ఏం చేసినా సోషల్ మీడియాలో భారీ ట్రెండ్‌గా మారిపోతుంది. తాజాగా ప్రభాస్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రొఫైల్ పిక్చర్ ని మార్చారు. దీంతో నెట్టింట ప్రభాస్ ట్రేండింగ్ లో నిలిచాడు. ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే డీపీని కొనసాగిస్తూ వచ్చారు. తన కెరీర్ ని పీక్ స్టేజ్ కు తీసుకు వెళ్లి పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చిన బాహుబలిలోని ఫోటోను 7ఏళ్లుగా డీపీగా ఉంచాడు రెబల్ స్టార్.
ప్రతి సినిమాకు సంబంధించిన పోస్టర్లు, అప్డేట్లు షేర్ చేస్తున్నప్పటికీ ప్రొఫైల్ పిక్‌ను మాత్రం అలాగే ఉంచేవారు. అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత దాదాపు 7 ఏళ్ల తర్వాత ‘ఫౌజీ’ లుక్‌లో ఉన్న ఫోటోను తన డీపీగా పెట్టడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. డీపీ మారిన కొద్ది నిమిషాల్లోనే లక్షలాది మంది అభిమానులు, సినీ ప్రేమికులు ఈ ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తుండడంతో #PrabhasDP అనే హ్యాష్‌ట్యాగ్‌లు అన్ని ప్లాట్‌ఫామ్‌లలో టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఏదేమైనా ప్రభాస్ చిన్న డిపి మార్పుతోనే బాక్సాఫీస్ అప్డేట్ ఇచ్చినంత హంగామా సృష్టించారని చెప్పవచ్చు. హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న తన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిమిస్తుండగా ఈ ఏడాది డిసెంబర్ 2న ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Also Read
తాజావార్తలు
-
Moto G Max: భారత్ లో మోటో జి మ్యాక్స్ విడుదల.. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్, 7,000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్స్ ఇవే
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
JoJo : ‘జోజో’ ఫస్ట్ లుక్.. ‘మనోభావాల బ్యాచ్’కి స్వీట్ వార్నింగ్
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
ట్రెండింగ్
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్‌కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!