Site icon NTV Telugu

Project K : ప్రభాస్, దీపికా ఈ పాత్రల్లోనా ?

Project-K

Project K యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ రోజుకొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదేనంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. Project K పౌరాణిక కథల నుంచి ప్రేరణ పొందిన కథగా రూపొందుతోందని, అమితాబ్ అందులో అశ్వత్థామగా కనిపిస్తారని అన్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్, దీపికా పాత్రలపై కూడా అలాంటి ఆసక్తికరమైన రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Read Also : RRR : మరో రికార్డు… సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ ఎక్కువ !?

“ప్రాజెక్ట్ కే”లో అమితాబ్, ప్రభాస్ తండ్రీకొడుకుల పాత్రలలో కనిపిస్తారని, అమితాబ్ అశ్వథామ అనే ధనిక వ్యాపారవేత్తగా, దీపిక ఆయన ఉద్యోగి పాత్రలో నటిస్తున్నారట. “ప్రాజెక్ట్ కే” అనేది టైమ్ మెషీన్ ద్వారా భవిష్యత్తు, గతానికి వెళ్ళే తండ్రి, కొడుకుల కథ అని ప్రచారం జరుగుతోంది. ఇక “ప్రాజెక్ట్ కే” అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్ కు టైటిల్ ను ఖరారు చేయనున్నారు. అశ్విని దత్ ఈ మెగా బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. ఇప్పుడు ప్రభాస్ స్పెయిన్‌లో సెలవులు తీసుకుంటున్నాడు. ఈ వారాంతంలో అతను తిరిగి హైదరాబాద్‌కు తిరిగి వస్తాడని భావిస్తున్నారు.

Exit mobile version