ఆదిపురుష్ నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు, కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు, మా హీరోని ఏం చేస్తున్నారు? మా హీరో పాన్ ఇండియా సినిమాకి బజ్ లేదు అంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఆదిపురుష్ అప్డేట్ కావాలంటూ ట్రెండ్స్ కూడా చేశారు. అప్పుడు అప్డేట్ ఎందుకు? డైరెక్ట్‌గా టీజర్ రిలీజ్ చేస్తానని.. అయోధ్యలో గ్రాండ్‌గా ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేశాడు ఓం రౌత్. ఇంకేముంది… ఈ ఒక్క టీజర్ చాలదా, సినిమాను నాశనం చేయడానికి అనేలా ఆదిపురుష్ పై ట్రోలింగ్ జరిగింది. ప్రభాస్ లాంటి స్టార్ హీరోని పెట్టుకొని యానిమేషన్ సినిమా తీస్తావా? అంటూ ఓం రౌత్ పై మండి పడ్డారు రెబల్స్. త్రీడిలో టీజర్ చూపించినా కూడా ట్రోలింగ్ ఆగలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆదిపురుష్ పై అంచనాలు మారుతున్నాయి. సంక్రాంతి నుంచి జూన్ 16కి ఆదిపురుష్ సినిమాను పోస్ట్‌పోన్ చేసి… ఈ మధ్యలో గ్రాఫిక్స్‌ను మరింత బెటర్‌గా మార్చాడు ఓం రౌత్. రీసెంట్‌గా బయటికొచ్చిన టీజర్ విజువల్స్ చూసిన తర్వాత ఆదిపురుష్ పై పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా జై శ్రీరామ్ లిరికల్ మోషన్ పోస్టర్ ఆదిపురుష్ ఫేట్ ని మార్చింది. ఇలాంటి పోస్టర్ అండ్ సాంగ్ ని పెట్టుకోని సైలెంట్ గా ఎందుకు ఉన్నావ్ ఓం మావా అంటూ ఫాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చేసారు.
ఈ మోషన్ పోస్టర్ తర్వాత రిలీజ్ అయిన కృతి సనన్ పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు అప్డేట్స్ ఆదిపురుష్ సినిమాని మోస్ట్ వాంటెడ్ సినిమాల లిస్టులోకి తెచ్చేసాయి. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ బజ్‌ని మరింత పాజిటివ్‌గా మార్చాలంటే ఖచ్చితంగా ట్రైలర్ రావాల్సిందే. ఓం రౌత్ కూడా ఇదే ప్లానింగ్‌లో ఉన్నాడు. అందుకే ట్రైలర్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నాడనే విషయంలోనే క్లారిటీ రావడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం రోజుకో డేట్ తెరపైకి వస్తోంది. లేటెస్ట్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెండ్ డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. మే 9న ఆదిపురుష్ ట్రైలర్‌ను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యిందట. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని తిరుపతిలో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ఏదేమైనా.. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు మాత్రం… సోషల్ మీడియా హోరెత్తి పోవడం ఖాయం.