NTV Telugu Site icon

Adipurush: ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు… రికార్డులు ఏమైనా మిగిలాయా?

Adipurush

Adipurush

వెండి తెరపై ప్రభాస్‌ను శ్రీరాముడిగా చూసి సంబరపడి పోతున్నారు అభిమానులు. రామాయణం ఆధారంగా రూపొందిన ‘ఆదిపురుష్’.. జూన్ 16న తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీంతో డే వన్ ఆదిపురుష్ భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమనుకున్నారు. అందుకు తగ్గట్టే.. ఫస్ట్ డే రికార్డు స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టింది ఆదిపురుష్‌. వరల్డ్ వైడ్‌గా 140 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించారు మేకర్స్. దీంతో బాహుబలి 2, RRR, KGF 2 తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది. రెస్టాఫ్ ఇండియా కలుపుకుని 50 కోట్ల వచ్చినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.

మొత్తంగా ఓవర్ సీస్ కలుపుకొని 140 కోట్లతో ఇండియన్ టాప్ 5 ఓపెనింగ్స్‌ అందుకున్న సినిమాల్లో.. టాప్ 4లో నిలిచింది ఆదిపురుష్‌.సెకండ్ ప్లేస్‌లో బాహుబలి2, నాలుగో స్థానంలో ఆదిపురుష్, సాహో ఐదో స్థానంలో ఉంది. మొత్తంగా ఆదిపురుష్‌తో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు ప్రభాస్. ఇక ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్‌ సినిమాను.. టీ సిరీస్ సంస్థ పై 550 కోట్ల భారీ బడ్జెట్‌తో భూషణ్ కుమార్ నిర్మించాడు. కృతి సనన్ సీతగా నటించగా… సైఫ్ అలీఖాన్ రావణ్‌గా నటించాడు. మొత్తంగా రిలీజ్‌కు ముందు ఎన్నో వివాదాలకు గురైన ఆదిపురుష్.. ఊహకందని విధంగా ఓపెనింగ్స్ అందుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. మరి లాంగ్ రన్‌లో ఆదిపురుష్ వెయ్యి కోట్లు రాబట్టి.. ప్రభాస్ కెరీర్లో మరో రికార్డ్ సెట్ చేస్తుందేమో చూడాలి.

Show comments