Site icon NTV Telugu

Prabhas: ‘ఆదిపురుష్‌’ ఫస్ట్‌ డే కలెక్షన్స్ ఎంత?

Adipurush

Adipurush

ప్రస్తుతం థియేటర్లన్ని రామ మందిరాలుగా మారిపోయాయి. ఎక్కడికెళ్లినా ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. హనుమంతుడితో కలిసి రాముడిని చూసేందుకు సినీ ప్రియులంతా క్యూ కట్టారు. రిలీజ్‌కు ముందే ప్రభాస్ ఆదిపురుష్‌ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్‌ విషయంలోను ఆదిపురుష్ జోరు చూపించింది. దీంతో ఆదిపురుష్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అని ట్రేడ్ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి. ఆదిపురుష్‌ ఖచ్చితంగా వెయ్యి కోట్ల బొమ్మ అని.. ముందే డిసైడ్ అయిపోయారు కాబట్టి.. ఫస్ట్ డే ఆదిపురుష్ కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. ముందు నుంచి ఆదిపురుష్‌ వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందని భావించాయి ట్రేడ్ వర్గాలు. ఆ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ చూసి.. 150 కోట్ల వరకు రాబడుతుందని అనుకున్నారు. కానీ థియేటర్లో ఆదిపురుష్ హైప్ చూసిన తర్వాత అంతా తారుమారు అయ్యింది.

వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే దాదాపు 200 కోట్లకు గ్రాస్‌ రాబట్టనుందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి. హిందీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో 70-75% ఓవరాల్ ఆక్యుపెన్సీతో ఆదిపురుష్‌ రన్ అవుతోంది. దాంతో బాలీవుడ్‌లో 30 కోట్లకు అటు ఇటు కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. తెలుగుతో పాటు మిగతా భాషల్లో 60 నుంచి 70 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బెనిఫిట్ షోష్, ప్రీమియర్ షో, ఓవర్సీస్‌ కలుపుకొని.. మొత్తంగా మరో వంద కోట్లకు అటు ఇటు లెక్కలు వేసుకున్నా.. ఆదిపురుష్‌ డే వన్ కలెక్షన్స్ 150 కోట్లు క్రాస్ చేయడం ఖాయమని అంటున్నారు. ఇదే జరిగితే ప్రభాస్ పేరు చాలు ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి అనే మాట కొన్ని సంవత్సరాల పాటు వినిపించడం గ్యారెంటీ. మరి ఆదిపురుష్ ఫస్ట్ డే ఎంత రాబడుతుందో తెలియాలంటే.. మేకర్స్ నుంచి అఫిషీయల్ ఫిగర్ బయటికి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version