NTV Telugu Site icon

Prabhas: ఇది ‘ఆదిపురుష్’ అసలు లెక్క!

Prabhas

Prabhas

ఎన్నో వివాదాల మధ్య భారీ అంచనాలతో రిలీజ్ అయింది ఆదిపురుష్ సినిమా. డే వన్ నుంచి ఈ సినిమాకు మిక్స్‌డ్ స్టార్ట్ అయింది. అయినా ప్రభాస్ క్రేజ్‌తో 140 కోట్ల ఓపెనింగ్స్.. మూడు రోజుల్లోనే 340 కోట్లు రాబట్టింది కానీ ఆ తర్వాత ఆదిపురుష్ కలెక్షన్లు కాస్త నెమ్మదించాయి. అయినా కూడా ఫస్ట్ వీక్‌లో 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఆదిపురుష్ 10 డేస్ కలెక్షన్స్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఆదిపురుష్ సినిమా 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థలు ట్విట్టర్ ద్వారా ప్రకటించాయి. ఈ లెక్కన ఏడు రోజుల్లో మరో 110 కోట్లు మాత్రమే రాబట్టింది ఆదిపురుష్. అయితే రాబోయే రోజుల్లో మరో 50 కోట్లు వసూలు చేసి.. ఆదిపురుష్ 500 కోట్ల మార్కును టచ్ చేస్తుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే.. తెలుగుతో పాటు నార్త్‌లోను ఆదిపురుష్‌ ఆక్యుపెన్సీ బాగుందని అంటున్నారు.

ఆదిపురుష్ హిందీ వెర్షన్ 10 రోజుల్లో 140 కోట్ల వరకు వసూలు చేసిందని.. ఇప్పటికే అక్కడ లాభాల బాట పట్టిందని చెబుతున్నారు. ఇటు తెలుగులో 100 కోట్ల షేర్ వసూలు చేసిందని అంటున్నారు. దీంతో నాలుగోసారి తెలుగులో 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన హీరోగా నిలిచాడు ప్రభాస్. గతంలో బాహుబలి, బాహుబలి 2, సాహో సినిమాలు 100 కోట్లకు పైగా షేర్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఆదిపురుష్ కూడా చేరిపోయింది. ఇదిలా ఉంటే.. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు టికెట్ ధరలను భారీగా తగ్గించారు మేకర్స్. 3డీ టికెట్ ధరను కేవలం 112కే అందిస్తున్నట్టు.. అది కూడా ఎడిటేడ్ వెర్షన్, డైలాగ్స్‌తో చూడొచ్చు అంటూ.. ప్రకటించారు. మరి లాంగ్‌ రన్‌లో ఆదిపురుష్ ఎంత వరకు రాబడుతుందో చూడాలి.