NTV Telugu Site icon

Adipurush: రజినీ, మహేష్ రికార్డులు బ్రేక్… ఇప్పుడు ప్రభాస్ టాప్

Adipurush Promotions

Adipurush Promotions

ఓవర్సీస్‌లో ఆదిపురుష్ దుమ్ముదులిపేస్తోంది. ఓవర్సీస్ బుకింగ్స్ పరంగా.. హాలీవుడ్ చిత్రం ‘ది ఫ్లాష్’ని సైతం వెనక్కి నెట్టేసింది ఆదిపురుష్‌. ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలుపుకొని, యూఎస్‌ బాక్సాఫీస్ దగ్గర ఆదిపురుష్ సినిమా టిల్ డేట్ 2 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. కేవలం మూడు రోజుల్లోనే 2 మిలియన్ మార్క్ ని దాటిన ఆదిపురుష్ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొదటి వారం కంప్లీట్ అయ్యే లోపే ఆదిపురుష్ సుమారు 3.5-4 మిలియన్‌ డాలర్లు రాబట్టనుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా.. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అమలాపురం నుంచి అమెరికా వరకు ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ ని కుదిపేస్తోందనే  చెప్పాలి.

Read Also: Prabhas: రెబల్ కాదు ‘రాయల్‌’ ప్రభాస్…

ప్రభాస్ ఓవర్సీస్ ర్యాంపేజ్ కి సూపర్ స్టార్స్ రజిని, మహేష్ బాబుల రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి. సౌత్ ఇండియా నుంచి అత్యధికంగా 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాలు రజినీకాంత్, మహేష్ బాబు లిస్టులోనే ఉన్నాయి. ఇప్పటివరకూ రజినీకాంత్ నాలుగు సార్లు, మహేష్ బాబు నాలుగు సార్లు ఓవర్సీస్ మార్కెట్ లో 2 మిలియన్ డాలర్స్ ని రాబట్టారు. ప్రభాస్ ఇప్పుడు ఈ ఇద్దరి రికార్డులని బ్రేక్ చేసి 5 టు మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాలతో టాప్ ప్లేస్ చేరాడు. బాహుబలి, బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్ సినిమాల తర్వాత ఆదిపురుష్ సినిమా ఈ ఎలైట్ లిస్టులో చేరింది. ఇప్పటికే ఇండియాలో నాన్-ప్రభాస్ రికార్డ్స్ అనే మాట వినిపిస్తోంది. సలార్, ప్రాజెక్ట్ K కూడా రిలీజ్ అయిపోతే ఓవర్సీస్ లో కూడా నాన్-ప్రభాస్ రికార్డ్స్ అనే మాట వినిపించడం గ్యారెంటీ.