Site icon NTV Telugu

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’.. పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ అన్నమాట

Pawan Kalyan

Pawan Kalyan

న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇక ప్రమోషన్లో భాగంగా జూన్ 9 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్పకళావేదిక లో గ్రాండ్ గా నిర్వహించబోతున్న విషయం విదితమే.. అయితే ఈ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారో అని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఫ్యాన్స్ అందరికి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఏ.. ఇందులో నిజం లేదు.. పుకార్లు ఇవన్నీ అని అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా నానినే తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు.

“సుందర ప్రసాద్ కోసం పవన్ కళ్యాణ్.. థాంక్యూ పవన్ కళ్యాణ్ సర్.. మీరు వస్తున్నందుకు నేను, అంటే సుందరానికీ చిత్ర బృందం ఎంతో థ్రిల్ల్ అయ్యాం. 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ చివరగా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో పవన్ ఎంతటి సంచలనాన్ని సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ స్పీచ్ గురించి ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు మాట్లాడుకుంటున్నారు అంటే అతిశయోక్తి లేదు. ఆ ఈవెంట్ తరువాత మళ్లీ ఇప్పుడు ఈ ఈవెంట్ కు పవన్ గెస్ట్ గా రాబోతున్నాడు. మరి ఈ వేడుకలో పవన్ ఎలాంటి మాటలు మాట్లాడనున్నారో అని ఇప్పటినుంచే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version