Site icon NTV Telugu

Power Star Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కౌంట్‌ డౌన్ స్టార్ట్!

Pawan Kalyan

Pawan Kalyan

ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఆదిపురుష్ ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ప్రభాస్ ఫాన్స్ హంగామా చేస్తున్నారు. ఆదిపురుష్ సౌండ్ ఆగిపోకముందే… సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ సౌండ్ స్టార్ట్ అయిపోయింది. గబ్బర్ సింగ్ కాంబోని రిపీట్ చేస్తు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు పవన్, హరీష్ శంకర్. హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా గబ్బర్ సింగ్ రేంజ్‌ సినిమా అవుతుందని ఫాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. హరీష్ శంకర్ కూడా పవర్ స్టార్ ఆర్మీని యుద్దానికి సిద్దం అవండి అంటూ తెగ ఊరిస్తున్నాడు. ఈ సినిమా రీమేకా? కాదా? అనే విషయాన్ని పక్కకు పెడితే.. హరిష్ శంకర్ మాత్రం పవర్ స్టార్‌ని పవర్ ప్యాక్డ్‌ చూపించబోతున్నాడు. సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్‌కు సాలిడ్ రిప్లే ఇస్తూ.. మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాడు. దానికి తోడు పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండడం యూత్ కి మరింత కిక్ ఇస్తోంది. ఈ ఇద్దరికీ దేవిశ్రీ ప్రసాద్ స్టైల్లో ఓ మాస్ బీట్ పడితే స్క్రీన్స్ చిరిగిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పటి నుంచే పేపర్లు రెడీ చేసుకుంటున్నారు పవన్ అభిమానులు. అయితే ఇప్పటికే ఉన్న హైప్ ఆకాశాన్ని తాకేలా చెయ్యడానికి, ఎలివేషన్స్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడానికి ఫస్ట్ గ్లింప్స్ ని రెడీ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ అండ్ టీ. గబ్బర్ సింగ్ రిలీజ్ అయి 11 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా… మే 11న ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేయబోతున్నారు. హైదరాబాద్‌లోని సంధ్య 35 MM థియేటర్‌లో సాయంత్రం 04 గంటల 59 నిమిషాలకు గంటలకు లాంఛ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. అదే సమయంలో యూట్యూబ్‌లోను రిలీజ్ చేయనున్నారు. మొత్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినపోయినట్టే! మరి మే 11న పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో చెయ్యబోయే హంగామా, సంధ్య 35 MM థియేటర్ దగ్గర చెయ్యబోయే సెలబ్రేషన్స్ ఏ రేంజులో ఉంటాయో చూడాలి.

Exit mobile version