NTV Telugu Site icon

Posani Krishna Murali: పోసానికి మూడోసారి కరోనా.. ఆస్పత్రికి తరలింపు

Posani Krishna Murali

Posani Krishna Murali

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా డేంజర్ బెల్స్ మరోసారి ఇండియాలో మోగుతున్నాయి. రెండు లాక్ డౌన్స్ ని దాటుకుని ఇప్పుడిప్పుడే సాధారణ జీవితాలకి అలవాటు పడుతున్న ప్రజలని కరోనా మళ్లీ భయపెడుతోంది. రోజు రోజుకీ ఇండియాలో కేసులు పెరుగుతున్నాయి, చాలా రోజుల తర్వాత ఇండియాలో కొత్త కేసుల సంఖ్య 10 వేలకి చేరింది. దీంతో అందరిలోనూ కరోనా ఫీవర్ స్టార్ట్ అయిపొయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రెండు సార్లు కరోనా బారిన పడిన ప్రముఖు నటుడు, రచయిత, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళికి మూడోసారి కరోనా సోకింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న పోసాని, పూణేలో జరిగిన షూటింగ్లో పాల్గొని నిన్ననే హైదరాబాదుకు వచ్చాడు. పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.దీంతో హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చేరారు పోసాని కృష్ణ మురళి. తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్‌లోనే 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది.