Site icon NTV Telugu

Tina Turner: ప్రముఖ సింగర్ కన్నుమూత

Tina

Tina

Tina Turner: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు ప్రేక్షకులను భయబ్రాంతులను చేస్తున్నాయి. భాషా ఏదైనా నటులు మాత్రం ఒక్కరే. తాజాగా హాలీవుడ్ లో లెజెండరీ సింగర్ టీనా టార్నర్ కన్నుమూసింది. ఆమె గురించి, ఆమె సంగీతం గురించి సంగీత ప్రియులకు చెప్పాల్సిన అవసరమే లేదు. పాటల రచయితగా మరియు డాన్సర్ గా కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఆమె తన 83 వ ఏట కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె పూతిగా బెడ్ కే పరిమితమయ్యింది. చికిత్స సైతం బెడ్ మీదనే అందిస్తున్నారని సమాచారం. ఇక చికిత్స పొందుతూనే టీనా నేటి ఉదయం మరణించినట్లు తెలుస్తోంది.

Virupaksha: సుకుమార్ ఆ విషయం చెప్పకపోతే విరూపాక్ష హిట్ అయ్యేది కాదట

శరీర అవయవాలు అన్ని క్షీణించడంతోనే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతి వార్త విని సంగీత ప్రియులు తీవ్ర దిగ్బ్రాంతికి గురి అవుతున్నారు. క్వీన్ ఆఫ్ రాక్ అండ్ రోల్ బిరుదు దక్కించుకోవడంతో పాటు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఆమె ఎన్నో హిట్ సాంగ్స్ ను అందించింది. ఒక్క సినిమాల్లోనే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్, లైవ్ కన్సర్ట్స్ తో అప్పట్లో సంగీత ప్రపంచాన్ని షేక్ ఆడించింది. ఇక టీనా మరణవార్త విన్న ప్రముఖులు, అభిమానులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ట్విట్టర్ వేదికగా పోస్ట్లు పెడుతున్నారు.. రిప్ క్వీన్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

Exit mobile version