Poonam Kaur Releases a Sensational Video Before Elections: నటి పూనమ్ కౌర్ తాజాగా ఒక సంచలన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా కన్నడ నాట మత్రమే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ప్రజ్వల్ రేవణ్ణ గురించి ఆమె వీడియో రిలీజ్ చేసింది. కర్ణాటకలో సెక్యులర్ జనతాదళ్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ ప్రాంతానికి ఎంపీగా ఉన్నారు. కర్ణాటకలో జరిగిన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గంలో పోటీ చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సెక్యులర్ జనతాదళ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలు బయటకు వచ్చి షాకిస్తున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ అమ్మాయిలతో ఉల్లాసంగా గడిపిన అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 26న హాసన్ నియోజకవర్గానికి పోలింగ్ జరిగిన రోజు నుంచి ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Sahil Khan: 40 గంటల పాటు 5 రాష్ట్రాల్లో ఛేజింగ్.. 1800 కి.మీ ఛేజ్ తర్వాత అరెస్ట్!
అలాంటి వ్యక్తికి ఓటేస్తారా? అనే క్యాప్షన్స్ తో ఈ అశ్లీల వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో దేవెగౌడ కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అసభ్యకర వీడియో కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో రేవణ్ణపై మహిళలను బెదిరించి లైంగికంగా వేధించడంతో పాటు అసభ్యకర వీడియోలు తీయడంపై ఫిర్యాదు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ ప్రజ్వల్ రేవణ్ణ యొక్క అసభ్యకరమైన వీడియో గురించి ఒక వీడియోను విడుదల చేసింది. అందులో, 2800 మందికి పైగా మహిళలను బెదిరించి లైగింక వేధింపులకు గురి చేసి అసభ్యకర వీడియోలు తీసిన రేవణ్ణ.. ఇప్పుడు జర్మనీకి పారిపోయాడని ఆమె పేర్కున్నారు. అతనికి డబ్బు, పలుకుబడి ఉంది, అందుకే ఈ ప్రభుత్వం అతన్ని ఏమీ చేయలేదు. అందుకే ఆటను వెళ్లి జర్మనీలో కూర్చున్నాడు.
జనరల్ పబ్లిక్ అతని మీద తిరగబడనంత వరకు అతనికి శిక్ష పడుతుందని చెప్పలేం అని అన్నారు. అంతేకాదు భారత మహిళలు అందరికీ చేతులు జోడించి అడుగుతున్నా వారిని మాత్రమే కాదు మహిళల మీద ప్రేమ ఉన్న పురుషులను కూడా కోరుతున్నా దయచేసి ఇలాంటి ఆరోపణలు, కేసులు ఉన్నవారికి అసలు ఓట్లు వేయకండి. మహిళలను శక్తులుగా పూజించే మన దేశంలో ఇలాంటి వాళ్ళని గెలిపిద్దామా? అని ఆమె ప్రశ్నించారు. అతన్ని పెట్టుకోలేని ఈ ప్రభుత్వం మనల్ని ఎలా కాపాడుతుంది.. ఒక్కసారి ఆలోచించి ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి ఓటు వేయాలి. ఈ ఎన్నికల్లో మహిళలకు రక్షణ కల్పించే వారికి ఓటు వేయండి, ఇది ప్రతి పౌరుడి కర్తవ్యం. అన్యాయం చేసే వారికి అధికారం ఇవ్వకండి అని ఆమె చెప్పుకొచ్చింది. మహిళలను ఇబ్బంది పెట్టే వారు ఇలాంటి పొజిషన్స్ లోకి వెళితే ఇక పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండని కోరింది. ఈ ప్రజ్వలను వదలొద్దు. ఒక జంతువు కూడా ఇలా చేయదు. మనం రామ రాజ్యం వైపు వెళ్తున్నామా? లేక రావణ రాజ్యం వైపు వెళ్తున్నామా? అని ఆమె ప్రశ్నించారు.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) April 29, 2024