NTV Telugu Site icon

Pooja Hegde: సమంత వల్ల బుట్టబొమ్మకి తెలుగు సినిమా దొరికిందోచ్

Pooja Hegde

Pooja Hegde

Pooja Hegde to act with Siddhu Jonnalagadda in Nandini Reddy Movie: దక్షిణాది భామ పూజా హెగ్డే తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో స్టార్డం సంపాదించుకుంది. అయితే ఆమె మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి డేట్లు ఖాళీ లేవనే కారణంతో తప్పుకుంది. అయితే ఆ తర్వాత ఆసక్తికరంగా ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా సైన్ చేయలేదు. ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం అనే సినిమాలో కూడా ఆమెని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నా ఎందుకో మరి ప్రియాంక మోహన్ ఫైనల్ అయింది. అయితే ఒకప్పుడు డేట్లు లేక తెలుగు సినిమాలు వదులుకున్న పూజా హెగ్డే కి ఇక తెలుగు సినిమాలే రావేమో అన్నట్టుగా ఎవరూ సంప్రదించడం మానేశారు. అయితే ఇప్పుడు సమంత కారణంగా పూజ హెగ్డే కి ఒక తెలుగు సినిమా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఒక సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది.

Animal: అసలైన పండగ అంటే ఇదే.. మహేష్ – జక్కన ఒకే స్టేజీపై

ఆ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుందని ముందు నుంచి కూడా ప్రచారం జరిగింది. కానీ సమంత రెస్ట్ మోడ్ లో నుంచి ఇంకా బయటకు రాని నేపథ్యంలో తాను సినిమా చేయలేనని తన స్నేహితురాలు నందిని రెడ్డికి తేల్చి చెప్పిందట. అయితే ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అనే ఆలోచిస్తున్న సమయంలో పూజా హెగ్డే అయితే కరెక్ట్ గా ఉంటుందని సినిమా యూనిట్ భావించడంతో చివరికి ఆమెను సంప్రదించారట. ఆమె కూడా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు సినిమా పట్టాలు ఎక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి బాలీవుడ్ షాహిద్ కపూర్ తో పూజా హెగ్డే ఒక సినిమా చేస్తోంది. తెలుగులో అయితే ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అధికారికంగా ఫైనల్ కాలేదు. ఈ సినిమా ఫైనల్ అయిన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.