Site icon NTV Telugu

మంచి మనసు చాటుకున్న పూజా హెగ్డే

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఎంతో మంది జీవితాలను రోడ్డున పడేసింది. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కాగా సినిమా సెలెబ్రిటీలు త‌మవంతు సాయంగా ముందుకు వస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ నటి పూజా హెగ్డే లాక్‌డౌన్ కార‌ణంగా స‌మస్య‌లు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల‌కు అండ‌గా నిలిచారు. 100 కుటుంబాల‌కు నెల‌కు స‌రిప‌డా స‌రుకుల్ని అందించి మంచి మనసు చాటుకున్నారు. వాట‌న్నింటిని త‌నే స్వ‌యంగా ప్యాక్ చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Exit mobile version